AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barley Benefits: బార్లీని ఎలా వాడితే ఆరోగ్యానికి మంచిది? వీటిలో ఉండే పోషకాలేంటి?

బార్లీ.. కేవలం వేసవిలోనే కాదు.. రోజూ వాడొచ్చు. వీటిలో విటమిన్-B పోషకాలు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. పొట్టు తీసిన బార్లీ గింజలకంటే.. పొట్టు తీయని బార్లీ గింజలను వాడగలిగితే ఆరోగ్యానికి మరింత మంచిదంటున్నారు నిపుణులు. బార్లీ గింజలతో కాచిన నీటిని.. ఆ గింజలతో సహా తాగితేనే శరీరానికి వాటి పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. కేవలం శరీరంలో పెరిగిన వేడిని తగ్గించడమే కాదు.. బార్లీ గింజలతో కాచిన నీటిని తాగడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి..

Barley Benefits: బార్లీని ఎలా వాడితే ఆరోగ్యానికి మంచిది? వీటిలో ఉండే పోషకాలేంటి?
barley benefits
Chinni Enni
| Edited By: |

Updated on: Aug 12, 2023 | 6:39 AM

Share

బార్లీ.. కేవలం వేసవిలోనే కాదు.. రోజూ వాడొచ్చు. వీటిలో విటమిన్-B పోషకాలు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. పొట్టు తీసిన బార్లీ గింజలకంటే.. పొట్టు తీయని బార్లీ గింజలను వాడగలిగితే ఆరోగ్యానికి మరింత మంచిదంటున్నారు నిపుణులు. బార్లీ గింజలతో కాచిన నీటిని.. ఆ గింజలతో సహా తాగితేనే శరీరానికి వాటి పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. కేవలం శరీరంలో పెరిగిన వేడిని తగ్గించడమే కాదు.. బార్లీ గింజలతో కాచిన నీటిని తాగడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

జీర్ణాశయం శుభ్రం: బార్లీ గింజల నీటిని ఎనీ టైమ్ తాగొచ్చు. కానీ పరగడుపున తాగితే ఇంకా మంచిది. జీర్ణాశయం శుభ్రమై.. అజీర్తి సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవారికి బార్లీనీళ్లు సహజసిద్ధమైన మెడిసిన్ గా పనిచేస్తాయి. రోజుకి కనీసం రెండు లీటర్ల బార్లీనీళ్లు తాగగలిగితే.. శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.

మినరల్స్ అండ్ విటమిన్స్: బార్లీ నీటిలో క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి మినరల్స్ తో పాటు.. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

అధిక బరువు తగ్గుతారు: లావుగా ఉన్నవారందరికీ కొవ్వు కారణంగా శరీరం పెరిగిందని అర్థం కాదు. కొందరికి నీరు ఒల్లు కూడా ఉంటుంది. అలాంటి వాళ్లు బార్లీ నీళ్లు తరచూ తాగుతూ ఉంటే.. ఆ నీరంతా యూరిన్ రూపంలో బయటకు వెళ్లిపోయి.. అధిక బరువు తేలికగా తగ్గొచ్చు. కడుపునిండిన అనుభూతి కలిగి ఆకలి కూడా త్వరగా ఉండదు.

చెడు కొలెస్ట్రాల్ కు చెక్: బార్లీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది నీటిలో ఈజీగా కరిగిపోతుంది. కాబట్టి బార్లీ నీళ్లు రోజూ తాగితే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

మధుమేహం తక్కుతుంది: షుగర్ పేషంట్స్ కూడా బార్లీ నీళ్లను ఎలాంటి అనుమానం లేకుండా తాగొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అలాగే కామెర్లు అయినవారు కూడా తరచూ బార్లీ నీరు తాగుతూ ఉంటే త్వరగా కోలుకుంటారు. వీరికి కనీసం రోజుకి 2-3 లీటర్ల బార్లీ నీళ్లు తాగించాలి.

బార్లీనీళ్లను ఇలా తయారు చేసుకోవాలి:

బార్లీ గింజలను గోధుమరంగు వచ్చేంతవరకూ వేయించి.. పొడి చేసుకుని ఒక గాజుసీసాలో స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక లీటరు నీటిని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాలి. అందులో మూడు స్పూన్ల బార్లీ గింజల పొడి వేసి.. 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. బార్లీ గింజలు ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని.. అవి చల్లారాక ఒక్కోగ్లాసు చొప్పిన రెండు గంటలకొకసారి తాగితే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే తాగలేకపోతే.. కొద్దిగా పంచదార కలుపుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..
ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..
పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??
పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??
అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !
అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !