AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Amla Health Benefits: ఎండిన ఉసిరిలో విటమిన్లు-మినరల్స్:.. ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలో !!

వర్షాకాలం ముగిసి.. శీతాకాలం వస్తుండటంతోనే మనకు ఉసిరికాయలు లభిస్తాయి. అంటే దీపావళి పండుగ నుంచి ఉసిరికాయలు మార్కెట్లలో దొరుకుతాయి. మిగతా రోజుల్లో ఉసిరికాయలు దొరకడం కాస్త కష్టమే. అందుకే ఉసిరికాయలు దొరికినప్పుడే.. ఉసిరి ఆవకాయను ఏడాదికి సరిపడా పెట్టుకుంటారు. కొందరైతే ఉసిరికాయల్లో గింజను తీసివేసి.. ఎండబెట్టి నిల్వచేసుకుంటారు. వాటిని అప్పుడప్పుడు పప్పువంటి కూరల్లో వాడుతారు. అలాగే కొన్నిరకాల ఆయుర్వేద మందుల తయారీకి కూడా ఎండిన ఉసిరిని..

Dry Amla Health Benefits: ఎండిన ఉసిరిలో విటమిన్లు-మినరల్స్:.. ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలో !!
Dry Amla Benefits
Chinni Enni
|

Updated on: Aug 10, 2023 | 6:30 PM

Share

వర్షాకాలం ముగిసి.. శీతాకాలం వస్తుండటంతోనే మనకు ఉసిరికాయలు లభిస్తాయి. అంటే దీపావళి పండుగ నుంచి ఉసిరికాయలు మార్కెట్లలో దొరుకుతాయి. మిగతా రోజుల్లో ఉసిరికాయలు దొరకడం కాస్త కష్టమే. అందుకే ఉసిరికాయలు దొరికినప్పుడే.. ఉసిరి ఆవకాయను ఏడాదికి సరిపడా పెట్టుకుంటారు. కొందరైతే ఉసిరికాయల్లో గింజను తీసివేసి.. ఎండబెట్టి నిల్వచేసుకుంటారు. వాటిని అప్పుడప్పుడు పప్పువంటి కూరల్లో వాడుతారు. అలాగే కొన్నిరకాల ఆయుర్వేద మందుల తయారీకి కూడా ఎండిన ఉసిరిని వాడుతారు. రోజుకి 1 లేదా 2 డ్రై ఆమ్లా ముక్కలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

విటమిన్లు-మినరల్స్: తాజా ఉసిరికాయలోనే కాదు.. ఎండిన ఉసిరి ముక్కల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి ఎండిన తర్వాత యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావు.

అజీర్తి నో: ప్రతిరోజూ ఎండిన ఉసిరి తింటే.. అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జుట్టు సమస్య ఉండదు: జుట్టు రాలడం వంటి సమస్యతో బాధపడేవారికి ఎండిన ఉసిరి మంచి పరిష్కారం. ఉసిరి ముక్కల్ని తినడం వల్ల శిరోజాలు రాలడం తగ్గి.. ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతాయి. కుదుళ్లు కూడా దృఢంగా ఉంటాయి.

వాపులకు చెక్: ఎండిన ఉసిరి ముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంపై వచ్చే వాపులు, ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతాయి.

చర్మం కాంతివంతంగా: రోజూ రెండు ఎండిన ఉసిరి ముక్కలను తింటే.. చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. చర్మంపై త్వరగా ముడతలు రావు. మొటిమలు, మచ్చలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. ఆందోళన, వణుకు, మతిమరుపు, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి