AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Utensils Tips: ఈ మూడు కలిపి వాడండి.. మాడిన వంటపాత్రలు కూడా తళతళా మెరుస్తాయ్!!

మీ వంటింట్లో ఇప్పటికే చాలాసార్లు వంటపాత్రలు మాడిపోయి ఉంటాయి కదూ. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లలకు టిఫిన్, లంచ్, స్నాక్స్.. ఆఫీసుకెళ్లే భర్తకు లంచ్ హడావిడిగా వంట చేయడంలో ఇలా జరగడం కామన్. ఇక మీరు కూడా ఆఫీసుకెళ్లే గృహిణి అయితే.. ఆ మాడిపోయిన వంటపాత్రను కడిగేసరికి చేతులు అరిగిపోతాయ్. ఒక్కోసారి స్టవ్ పై పాలు పెట్టి మరిచిపోతే.. అవి కూడా మాడిపోతాయ్. అంతేనా.. పాలు జస్ట్ పొంగినా.. అవి గిన్నె అంచులవద్ద ఆగిపోయి..

Cooking Utensils Tips: ఈ మూడు కలిపి వాడండి.. మాడిన వంటపాత్రలు కూడా తళతళా మెరుస్తాయ్!!
Cooking Utensils Tips
Chinni Enni
|

Updated on: Aug 10, 2023 | 12:52 PM

Share

మీ వంటింట్లో ఇప్పటికే చాలాసార్లు వంటపాత్రలు మాడిపోయి ఉంటాయి కదూ. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లలకు టిఫిన్, లంచ్, స్నాక్స్.. ఆఫీసుకెళ్లే భర్తకు లంచ్ హడావిడిగా వంట చేయడంలో ఇలా జరగడం కామన్. ఇక మీరు కూడా ఆఫీసుకెళ్లే గృహిణి అయితే.. ఆ మాడిపోయిన వంటపాత్రను కడిగేసరికి చేతులు అరిగిపోతాయ్. ఒక్కోసారి స్టవ్ పై పాలు పెట్టి మరిచిపోతే.. అవి కూడా మాడిపోతాయ్.

అంతేనా.. పాలు జస్ట్ పొంగినా.. అవి గిన్నె అంచులవద్ద ఆగిపోయి.. స్టవ్ నుంచి వచ్చే మంటకు గిన్నెకే అంటుకుపోయి మాడిన మచ్చల్లా ఉంటాయి. ఎంత సబ్బు వాడినా.. టీవీల్లో చూపించే యాడ్స్ లో వచ్చే లిక్విడ్ లు వాడినా.. ఇలా తోమగానే.. అలా మెరిసిపోవడం అనేది ససేమిరా జరగదు. మాడిన వంటపాత్రలను క్లీన్ చేయడానికి పెద్ద యుద్ధమే చేయాలి. ఆ కష్టం ఎలా ఉంటుందో.. గృహిణులకు బాగా తెలుసు. అందుకే మీ కష్టాన్ని తగ్గించేందుకు మాడిన పాత్రల్ని ఈజీగా శుభ్రం చేసే ఓ చిట్కా తీసుకొచ్చాం. ఇందుకోసం పెద్దగా ఖర్చు కూడా చేయనక్కర్లేదు.

ఇలా తయారు చేయండి:

ఇవి కూడా చదవండి

*ఒక గిన్నెలో ఒక కప్పు లిక్విడ్ డిటర్జెంట్ తీసుకుని.. అందులో అదే కప్పు మోతాదులో నీరు పోయాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వంటసోడా వేసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమంలో పాత్రలు తోమే పీచును ముంచి.. మాడిన వంటపాత్రలను కడిగితే.. వాటికి అంటుకున్న మాడు అంతా ఇట్టే వదిలిపోయి కొత్తపాత్రలు వలే తళతళ మెరుస్తాయి.

టాయిలెట్స్ కూడా శుభ్రం చేసుకోవచ్చు:

అలాగే ఈ లిక్విడ్ తో సింక్, జిడ్డు పట్టిన స్టవ్ ను కూడా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. టాయిలెట్ ను శుభ్రం చేసేందుకు కూడా ఈ లిక్విడ్ ను వాడొచ్చు. మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ తో టాయిలెట్ ను కడిగితే.. దానిపై పసుపు పచ్చగా పేరుకున్న మరకలు పోయి తెల్లగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కా ఉపయోగించి మాడిన మీ వంటపాత్రల్ని ఈజీగా శుభ్రం చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..