Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Benefits of Triphala Churna: రోజూ ఈ చూర్ణం తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.. మరి ఏజ్ వారు ఇది తినొచ్చో తెలుసుకోండి!!

మన శరీరంలో వచ్చే రోగాలకు మూల కారణాలు వాత, పిత, కఫ దోషాలు. ఈ మూడు సరిసమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. మూడింటిలో ఏమాత్రం హెచ్చుతగ్గులున్నా తరచూ ఏదొక అనారోగ్యం బారిన పడుతుంటారు. వాటిని తగ్గించుకునేందుకు వేలు, లక్షల రూపాయలను వెచ్చించాల్సి ఉంటుంది. శరీరంలో ఎక్కువైన వాత, పిత, కఫ దోషాల నుంచి బయట పడాలన్నా.. లేనివారిని మున్ముందు రాకుండా ఉండాలన్నా త్రిఫల చూర్ణాన్ని తినాలని ఆయుర్వేద వైద్య నిపుణులు..

Good Benefits of Triphala Churna: రోజూ ఈ చూర్ణం తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.. మరి ఏజ్ వారు ఇది తినొచ్చో తెలుసుకోండి!!
Triphala Churna
Follow us
Chinni Enni

|

Updated on: Aug 09, 2023 | 7:54 PM

మన శరీరంలో వచ్చే రోగాలకు మూల కారణాలు వాత, పిత, కఫ దోషాలు. ఈ మూడు సరిసమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. మూడింటిలో ఏమాత్రం హెచ్చుతగ్గులున్నా తరచూ ఏదొక అనారోగ్యం బారిన పడుతుంటారు. వాటిని తగ్గించుకునేందుకు వేలు, లక్షల రూపాయలను వెచ్చించాల్సి ఉంటుంది. శరీరంలో ఎక్కువైన వాత, పిత, కఫ దోషాల నుంచి బయట పడాలన్నా.. లేనివారిని మున్ముందు రాకుండా ఉండాలన్నా త్రిఫల చూర్ణాన్ని తినాలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలతో తయారు చేసేదానిని త్రిఫల చూర్ణం అంటారు. ఇది ఆయుర్వేదం షాపుల్లో లభిస్తుంది. ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లో కూడా అందుబాటులో ఉంటుంది. మరి వాత, పిత, కఫ దోషాలను నయం చేసే త్రిఫల చూర్ణాన్ని ఏ వయసువారు.. ఎంత మోతాదులో, ఎప్పుడు ఎలా తీసుకోవాలి ? తీసుకుంటే కలిగే ఫలితాలేంటో చూద్దాం.

ఉసిరికాయ: త్రిఫల చూర్ణంలో ఉండే ఉసిరిలో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది. టానిక్ ఆమ్లం, గ్లోకోజ్, ప్రొటీన్, కాల్షియం.. శరీరంలో పిత దోషాన్ని సరిచేస్తాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి.

ఇవి కూడా చదవండి

తానికాయ: అలాగే తానికాయల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. రుచికి వగరుగా ఉండే తానికాయల చూర్ణం కఫ దోషాలను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగించడంతో పాటు.. ఉబ్బసం, ఇతర శ్వాసకోస వ్యాధులను నివారిస్తుంది.

కరక్కాయ: త్రిఫల చూర్ణంలో ఒకటైన కరక్కాయ చూర్ణం.. వాత దోషాన్ని నివారిస్తుంది. అలాగే ఛాతీలో మంట, కండరాలు తీవ్రంగా కొట్టుకోవడం, నాడీ సంబంధిత ఇబ్బందులపై పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఎవరైనా తీసుకోవచ్చు: 10 సంవత్సరాలు పైబడిన పిల్లల నుంచి ఏ వయసువారైనా త్రిఫల చూర్ణాన్ని తీసుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ మోతాదులో త్రిఫల చూర్ణం కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి.

మలినాలు పోతాయి: మరుసటిరోజున భోజనానికి గంట లేదా అరగంట ముందు ఈ పానీయాన్ని తాగాలి. ఇలా రోజూ త్రిఫల చూర్ణం తీసుకుంటే.. గ్యాస్, మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. అలాగే శరీరంలో మలినాలు, విషపదార్థాలు తొలగిపోయి.. కాలేయం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దగ్గు, కఫం కూడా తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి