Curd Side Effects: ఈ సమస్యలతో బాధపడుతున్నవారు పెరుగును అస్సలు తినకూడదు..!!
భోజనంలో ఎన్నిరకాల వంటకాలు తిన్నా.. ఆఖరిలో పెరుగు లేకపోతే అసంతృప్తిగా ఉంటుంది. అందుకే ఎక్కడైనా సరే భోజనాలలో పెరుగు ఖచ్చితంగా వడ్డిస్తారు. రోజూ మన ఇంట్లో కూడా భోజనం చేశాక పెరుగుతో లేదా మజ్జిగతో తిననిదే భోజనం చేసిన అనుభూతి కలగదు. పెరుగు తినడం వల్ల శరీరానికి కొన్నిరకాల పోషకాలతో పాటు.. కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు సమస్యలు ఉన్నవారు పెరుగు తినకపోవడమే..
భోజనంలో ఎన్నిరకాల వంటకాలు తిన్నా.. ఆఖరిలో పెరుగు లేకపోతే అసంతృప్తిగా ఉంటుంది. అందుకే ఎక్కడైనా సరే భోజనాలలో పెరుగు ఖచ్చితంగా వడ్డిస్తారు. రోజూ మన ఇంట్లో కూడా భోజనం చేశాక పెరుగుతో లేదా మజ్జిగతో తిననిదే భోజనం చేసిన అనుభూతి కలగదు. పెరుగు తినడం వల్ల శరీరానికి కొన్నిరకాల పోషకాలతో పాటు.. కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు సమస్యలు ఉన్నవారు పెరుగు తినకపోవడమే మంచిదంటున్న వైద్య నిపుణులు. మరీ ముఖ్యంగా రాత్రి వేళలో అస్సలు తినకూడదంటున్నారు.
ఉదయం లేచిన తర్వాత గొంతులో కఫం, శ్లేష్మం పేరుకుపోయి ఉన్నవారు రాత్రివేళల్లో పెరుగుతినకూడదని చెబుతున్నారు. అలాగే ఆస్తమా, ఉదయం సమయంలో తుమ్ములు ఎక్కువగా వచ్చేవారు, తెల్లవారే సమయంలో ఎక్కువగా దగ్గు రావడం, బ్రాంకైటిస్ ఉన్నవారు రాత్రిపూట భోజనంలో పెరుగు తినకపోవడమే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
ఉదయం లేవడమే నొప్పులు, కండరాలు పట్టేసినట్టుగా ఉండేవారు కూడా పెరుగు తినకూడదు. అలా చేస్తే.. కఫం, శ్లేష్మం మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు మరింత ఎక్కువవుతాయి. రాత్రివేళ పెరుగు తింటే.. శరీరంలో ఇన్ ఫ్లామేషన్ పెరిగి నొప్పులు ఎక్కువ అవుతాయి. కాబట్టి రాత్రి సమయాల్లో పెరుగుకి దూరంగా ఉండటమే బెటర్. అలాగే పెరుగుకి బదులుగా మజ్జిగను తీసుకోవచ్చు. ఇది శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా.. యూరిన్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నా నివారిస్తుంది.
అలాగే పెరుగు తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు, స్కిన్ అలర్జీ, మొటిమలు వస్తాయి. పెరుగు తిన్న తర్వాత ఎక్కువగా వేడి అనిపించడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. పెరుగు వల్ల వేడెక్కడం వంటి లక్షణాలు కూడా కలిటి ఉంటాయి.. కాబట్టి చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పెరుగులో కఫ, పిత్త దోషాలు ఎక్కువగా ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి