బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారా.. షుగర్ తగ్గుతుందా? ఇది మీకోసమే!!
మన పూర్వీకుల కాలం నుంచి మనం తీసుకునే ఆహారంలో అన్నం ప్రధానమైనది. అయితే అప్పటికీ.. ఇప్పటికీ తినేది అన్నమే అయినా.. వాటిలో రకాలు, మార్పులు వచ్చాయి. అప్పట్లో ఒడ్డును దంచగా వచ్చిన బియ్యాన్ని వండుకుని తిన్నారు కాబట్టే ఆ కాలం వాళ్లు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నారు. మనం మాత్రం బాగా పాలిష్ పట్టి.. తెల్లగా ఉన్న అన్నాన్ని తింటున్నాం కాబట్టి ఇన్ని రోగాలు. అందుకే వైద్యులు సైతం షుగర్ ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి..
మన పూర్వీకుల కాలం నుంచి మనం తీసుకునే ఆహారంలో అన్నం ప్రధానమైనది. అయితే అప్పటికీ.. ఇప్పటికీ తినేది అన్నమే అయినా.. వాటిలో రకాలు, మార్పులు వచ్చాయి. అప్పట్లో ఒడ్డును దంచగా వచ్చిన బియ్యాన్ని వండుకుని తిన్నారు కాబట్టే ఆ కాలం వాళ్లు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నారు. మనం మాత్రం బాగా పాలిష్ పట్టి.. తెల్లగా ఉన్న అన్నాన్ని తింటున్నాం కాబట్టి ఇన్ని రోగాలు. అందుకే వైద్యులు సైతం షుగర్ ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి బ్రౌన్ రైస్ తినాలని సూచిస్తున్నారు. బ్రౌన్ రైస్ అంటే అదేదో రకం అనుకునేరు.. దంపుడు బియ్యం అనమాట. ఒక పొర పొట్టు మాత్రమే తీసిన బియ్యం. నిజంగా బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారా ? అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది. బరువు తగ్గడమే కాదు.. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
-బ్రౌన్ రైస్ లో క్యాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫోలేట్స్, ఫైబర్, B కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే అధిక బరువు ఉన్నవారు బ్రౌన్ రైస్ తినాలని వైద్యులు సూచిస్తారు. ఇది త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
-బ్రౌన్ రైస్.. వైట్ రైస్ అరిగినంత త్వరగా అరగదు కాబట్టి.. ఆకలి వేయకుండా ఉంటుంది. చిరుతిండ్లపై కోరికను తగ్గిస్తుంది.
-బ్రౌన్ రైస్ లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి.. షుగర్ వ్యాధి ఉన్నవారు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది.
-వీటిలో ఉండే ఆర్సెనిక్.. క్యాన్సర్, గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటీస్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.
-జీర్ణ సంబంధిత సమస్యలు, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం బ్రౌన్ రైస్ తినవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా నిదానంగా జీర్ణమవుతుంది కాబట్టి.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావొచ్చని అంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి