AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idli Snack: ఇడ్లీలు మిగిలితే పారేస్తున్నారా? ఇలా ట్రై చేసి స్నాక్ గా తినండి..టేస్ట్ సూపర్ అంతే!!

ఇడ్లీ.. మనం రోజూ ఉదయం పూట తినే టిఫిన్స్ లో ఇది కూడా ఒకటి. ఇంటిల్లిపాది బ్రేక్ ఫాస్ట్ పూర్తయ్యాక.. ఒక్కోసారి ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని ఇంట్లో పనివాళ్లుంటే పెడతారు. లేదంటే అలానే ఉంచేసి.. ఏ సాయంత్రానికో పారేస్తారు. కానీ ఇకపై మిగిలిన ఇడ్లీలను అలా పారేయకుండా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుని స్నాక్స్ గా తింటే.. సూపర్ టేస్టీగా ఉంటాయి. క్రిస్పీ ఇడ్లీ ఫ్రైస్ ను ఎలా చేసుకోవాలో చూద్దామా...

Idli Snack: ఇడ్లీలు మిగిలితే పారేస్తున్నారా? ఇలా ట్రై చేసి స్నాక్ గా తినండి..టేస్ట్ సూపర్ అంతే!!
Idli
Chinni Enni
|

Updated on: Aug 08, 2023 | 7:38 PM

Share

ఇడ్లీ.. మనం రోజూ ఉదయం పూట తినే టిఫిన్స్ లో ఇది కూడా ఒకటి. ఇంటిల్లిపాది బ్రేక్ ఫాస్ట్ పూర్తయ్యాక.. ఒక్కోసారి ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని ఇంట్లో పనివాళ్లుంటే పెడతారు. లేదంటే అలానే ఉంచేసి.. ఏ సాయంత్రానికో పారేస్తారు. కానీ ఇకపై మిగిలిన ఇడ్లీలను అలా పారేయకుండా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుని స్నాక్స్ గా తింటే.. సూపర్ టేస్టీగా ఉంటాయి. క్రిస్పీ ఇడ్లీ ఫ్రైస్ ను ఎలా చేసుకోవాలో చూద్దామా.

క్రిస్పీ ఇడ్లీ ఫ్రైస్ తయారీకి కావలసిన పదార్థాలు:

ఇడ్లీలు -6, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా, ఎండుమిర్చి -7, పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు- 1 టేబుల్ స్పూన్, మినపప్పు – 1 టేబుల్ స్పూన్, బియ్యం – 1 టేబుల్ స్పూన్, మిరియాలు – 1/2 టీ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి – 1/2 స్పూన్, ఇంగువ- కొద్దిగా, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – రుచికి తగినంత.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఒక పాత్రలో పైన పేర్కొన్న క్వాంటిటీ ప్రకారం.. ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, బియ్యం, మిరియాలు వేసి వేయించాలి. అవి వేగాక అందులోనే ఎండుకొబ్బరి పొడి, ఆమ్ చూర్ పొడి, ఇంగువ, కరివేపాకు వేసి లైట్ గా వేయించాలి. అవన్నీ చల్లారిన తర్వాత జార్ లో వేసి.. రుచికి తగినంత ఉప్పు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కళాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి.. వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీల ముక్కలను వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని.. వేయించుకున్న ఇడ్లీలపై 2 టేబుల్ స్పూన్ల మోతాదులో చల్లి అంతా కలిసేలా చూసుకోవాలి. అంతే వేడి వేడి క్రిస్పీ ఇడ్లీ ఫ్రైస్ రెడీ. వీటిని పిల్లలు స్కూల్ నుంచి రాగానే సర్వ్ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు