Special Diabetes Diet: మీకు డయాబెటీస్ ఉందా.. ఈ డైట్ తో షుగర్ కు విడాకులిచ్చేయండి!!
వయసు పై బడిన వారే కాదు.. యుక్త వయసు వారు, యవ్వనంలోనే అధికబరువు ఉన్నవారు కూడా డయాబెటీస్ బాధితులే. షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. కనీసం గంటసేపు వాకింగ్ లేదా జాగింగ్ కైనా వెళ్లాలి. వైద్యుల సలహా ప్రకారం.. ముందు మెడిసిన్, సెకండ్ వ్యాయామం, మూడు డైట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా పాటిస్తే.. లైఫ్ టైమ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్..
వయసు పై బడిన వారే కాదు.. యుక్త వయసు వారు, యవ్వనంలోనే అధికబరువు ఉన్నవారు కూడా డయాబెటీస్ బాధితులే. షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. కనీసం గంటసేపు వాకింగ్ లేదా జాగింగ్ కైనా వెళ్లాలి. వైద్యుల సలహా ప్రకారం.. ముందు మెడిసిన్, సెకండ్ వ్యాయామం, మూడు డైట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా పాటిస్తే.. లైఫ్ టైమ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిందే.
అలా కాకుండా.. మెడిసిన్ డోస్ తగ్గించుకోవాలనుకున్నా, షుగర్ నుంచి పూర్తిగా బయటపడాలన్నా ఇప్పుడు పాటిస్తున్న ఆర్డర్ ను మార్చాలి. మొదటి ప్రయారిటీ డైట్ కి ఇవ్వాలి. అంటే తినే ఆహారంలో నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఆ తర్వాత వ్యాయామం, దాని తర్వాత మెడికేషన్ కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆహార నియమాలు అంటే ఏం పాటించాలి? అని సందేహం వద్దు. కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్, ఉప్పు, కారాలు ఎక్కువగా తినడం తగ్గించాలి.
ఉదయం ఇడ్లీ, దోసెలు, ఉప్మాలను తగ్గించి.. నానబెట్టిన వేరుశెనగలు, పచ్చికొబ్బరి, ఎండు ఖర్జూరాలు రెండు, మొలకెత్తిన విత్తనాలు తింటే.. ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్ అందుతాయి. అలాగే లంచ్ లోకి అన్నం, బ్రౌన్ రైస్, మిల్లెట్ రైస్ కూడా కంప్లీట్ గా మానేసి.. ఆకుకూరలతో చేసిన కర్రీ, పప్పు కలిపి 2-3 చపాతీలు తింటే చాలు. మిల్లెట్స్ రొట్టెలు కూడా తినొచ్చు. సాయంత్రం వేళల్లో కొబ్బరినీళ్లు తాగి, వాల్ నట్స్, పుచ్చగింజలు, జీడిపప్పు, బాదంపప్పులు నానబెట్టినవి తినాలి.
డిన్నర్ లో బొప్పాయి, జామకాయ, రేగుపళ్లు, దానిమ్మ వంటి ఫ్రూట్స్ తినాలి. ఇలాంటి డైట్ పాటిస్తే.. షుగర్ కు వాడే మందుల సంఖ్య రెండుమూడు రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. అధిక బరువు కూడా ఇట్టే తగ్గుతారు. డిన్నర్ తర్వాత మళ్లీ ఒక అరగంట వాకింగ్ చేస్తే చాలు. ఈ డైట్ ను పాటిస్తే.. జీవితాంతం డయాబెటీస్ కు మందులు వాడాల్సిన అవసరం ఉండదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మీ డైటే మీ డయాబెటిక్ మెడిసిన్.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి