Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits of Fennel: పీరియడ్స్ మిస్ అవుతున్నాయా.. సోంపుతో ఇలా చేయండి.. సూపర్ రిజల్ట్!!

వంటిల్లే వైద్యశాల అని ఊరికే అనలేదు పెద్దలు. ఎన్నో రోగాలకు చక్కని పరిష్కారాలు మన వంటింట్లో ఉండే దినుసుల్లోనే ఉంటాయి. కానీ.. మనం వాటిని వదిలేసి చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులకు పరిగెడుతూ ఉంటాం. సరిగ్గా చూస్తే.. వంటింట్లో మనం వంటల తయారికి వాడే దినుసుల్లో ఎన్నో ఔషధాలుంటాయి. లవంగాలు, యాలకులు, ఆవాలు, జీలకర్ర, సోంపు గింజలు.. ఇలా ప్రతి దానిలోనూ ఔషధ గుణాలుంటాయి. ఒక్కొక్కటి ఒక్కో అనారోగ్యాన్ని..

Health Benefits of Fennel: పీరియడ్స్ మిస్ అవుతున్నాయా.. సోంపుతో ఇలా చేయండి.. సూపర్ రిజల్ట్!!
Fennel Seeds
Follow us
Chinni Enni

|

Updated on: Aug 09, 2023 | 6:31 PM

వంటిల్లే వైద్యశాల అని ఊరికే అనలేదు పెద్దలు. ఎన్నో రోగాలకు చక్కని పరిష్కారాలు మన వంటింట్లో ఉండే దినుసుల్లోనే ఉంటాయి. కానీ.. మనం వాటిని వదిలేసి చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులకు పరిగెడుతూ ఉంటాం. సరిగ్గా చూస్తే.. వంటింట్లో మనం వంటల తయారికి వాడే దినుసుల్లో ఎన్నో ఔషధాలుంటాయి. లవంగాలు, యాలకులు, ఆవాలు, జీలకర్ర, సోంపు గింజలు.. ఇలా ప్రతి దానిలోనూ ఔషధ గుణాలుంటాయి. ఒక్కొక్కటి ఒక్కో అనారోగ్యాన్ని తగ్గిస్తాయి. కొన్ని ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి కూడా కాపాడతాయి. ఇప్పటి వరకూ వంటింట్లోని చాలా దినుసుల గురించి తెలుసుకున్నాం.. ఈ రోజు సోంపు గింజల గురించి తెలుసుకుందాం.

సోంపు గింజల శాస్త్రీయ నామం ఫోనికులమ్ వల్గేర్. రుచికి తియ్యగా.. తిన్నాక మంచినీళ్లు తాగితే మింట్ ఫ్లేవర్ తగిలేలా ఉండే సోంపు గింజలలో ఎన్నో ఔషధ ప్రయోజనాలున్నాయి. పురాతన కాలంలో వీటిని బ్రీత్ ఫ్రెషనర్ గా వాడేవారు. ఇప్పుడు మనం వంటల్లో, మసాలాల తయారీల్లో , అప్పుడప్పుడూ రుచికోసం టీ తయారీల్లోనూ వాడుతున్నాం.

ఎన్నో విటమిన్స్: సోంపు గింజల్లో డైటరీ ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, ఇ ఉంటాయి. ఇంకా మరెన్నో సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

శరీరంలో మంటలను తగ్గిస్తాయి: వీటిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు.. శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. అలాగే ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి.

జీవక్రియ సరిగ్గా ఉంటుంది: ముఖ్యంగా సోంపు గింజలు జీర్ణక్రియపై ఎక్కువగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి లక్షణాల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.

పీరియడ్స్ సెట్: మహిళలు రుతుక్రమం సమయంలో సోంపు గింజలను తింటే.. అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. అలాగే రుతు విరతి, తిమ్మిరి, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. పీరియడ్స్ సక్రమంగా రానివారు.. ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు రెండు స్పూన్ల సోంపు గింజల్ని బాగా నమిలి తినాలి. వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. గర్భాశయ దోషాలు తగ్గి.. రుతుక్రమం మళ్లీ సజావుగా వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి