Arthritis: కీళ్లు నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆకులతో మటాష్ అంతే..
నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు ఉన్నవారు మన చుట్టుపక్కల లభించే పారిజాత ఆకులతో చెక్ పెట్టవచ్చు. పారిజాత వృక్షాన్ని దైవ వృక్షంగా చెబుతుంటారు. సాధారణంగా నేలపై రాలిన పూలు పూజకు శ్రేయస్కరం కాదని అంటారన్నది తెలిసిన విషయమే కదా. కానీ పారిజాత వృక్షం నుండి రాలిన పువ్వులు మాత్రమే కింద పడినా పూజకు ఉపయోగపడతాయి. దీని వెనుక ఒక పురాణం కూడా ఉంది. అది పక్కన పెడితే... కీళ్ల నొప్పులను తగ్గించడంలో పారిజాత ఆకులు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి.
కొద్ది దూరం నడవగానే మోకాళ్లు నొప్పి పెడుతున్నాయా ? అయితే అది ఆర్థరైటిస్ సమస్య కావచ్చు. ఇది సీరియస్ అయితే నడిచే పరిస్థితి కూడా ఉండదు. అందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక్కసారి ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) మొదలైతే.. ఆ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. దానిని నివారించడం చాలా ముఖ్యం. ఆర్థరైటిస్‌కి వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు టీనేజర్లకు కూడా సరైన ఆహారం తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు వస్తున్నాయి. కీళ్ల నొప్పుల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ, లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. కీళ్లనొప్పులు, ఎముకల నొప్పులు, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, బ్యాలెన్స్ కొల్పోతూ ఉండేవారు, కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు ఉన్నవారు మన చుట్టుపక్కల లభించే పారిజాత ఆకులతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పారిజాత వృక్షాన్ని దైవ వృక్షంగా చెబుతుంటారు. సాధారణంగా నేలపై రాలిన పూలు పూజకు శ్రేయస్కరం కాదని అంటారన్నది తెలిసిన విషయమే కదా. కానీ పారిజాత వృక్షం నుండి రాలిన పువ్వులు మాత్రమే కింద పడినా పూజకు ఉపయోగపడతాయి. దీని వెనుక ఒక పురాణం కూడా ఉంది. అది పక్కన పెడితే… కీళ్ల నొప్పులను తగ్గించడంలో పారిజాత ఆకులు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి.
6-7 పారిజాత ఆకులను తీసుకుని.. వాటిని శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ఒక గ్లాసు నీళ్లలో మిక్స్ చేసి ఓ గిన్నెలో పోయాలి. సగం గ్లాసు వచ్చేవరకు బాగా మరిగించాలి. ఆ కషాయాన్ని రాత్రిపూట అలానే ఉంచి.. మరుసటి రోజు ఉదయం మేల్కొన్న వెంటనే తాగాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పారిజాత ఆకుల్లోని జిగురు కషాయం ద్వారా శరీరంలోకి వెళ్లి అరిగిపోయిన మోకాలి కీళ్లపై పనిచేస్తుంది. ఇది కీళ్ల నొప్పుల నుండి కొంత ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కొబ్బరినూనెలో 5-6 చుక్కల పారిజాత నూనె వేసి.. కీళ్ల నొప్పులు ఉన్నచోట కాసేపు మసాజ్ చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే నొప్పులు తగ్గుతాయి.
పారిజాత ఆకుల కషాయం వల్ల మరికొన్ని లాభాలు
- మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులపై పోరాడేందుకు కావాల్సిన శక్తి లభిస్తుంది
- జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలను నుంచి స్వాంతన లభిస్తుంది
- యాంటీ అలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ.. ఇన్‌ఫెక్షన్లు ఎదుర్కునేందుకు సాయపడుతుంది
- శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
- ఒత్తడి తగ్గడంతో.. మలబద్దకం అనేదే ఉండదు
- జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అసిడిటీ, వికారం వంటి వాటిపై మంచిగా పనిచేస్తుంది
(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీరూ ఫాలో అయ్యేముందు వైద్యులను సంప్రదించండి)
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..