Smart phone: మొబైల్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటున్నారా.? మీకు పిల్లలు పుట్టకపోవచ్చు జాగ్రత్త..

స్మార్ట్ ఫోన్‌ రేడియేషన్‌ ద్వారా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని తెలిసిందే. అయితే స్మార్ట్‌ ఫోన్‌ సంతానలేమికి కూడా కారణంగా మారుతోందని మీకు తెలుసా.? అవును మీరు చదివింది నిజమే. మీరు ఎంతగానో ఇష్టపడుతోన్న మీ స్మార్ట్ ఫోన్‌ మీకు శత్రువుగా మారుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటే ఈ ప్రమాదం మరీ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్‌, వేడి. మగవారి శుక్రకణాల ఉత్పత్తిపై ఇది ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు....

Smart phone: మొబైల్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటున్నారా.? మీకు పిల్లలు పుట్టకపోవచ్చు జాగ్రత్త..
Lifestyle News
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 10, 2023 | 10:51 AM

మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్‌ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక పూట తినకుండా అయినా ఉంటున్నారు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్‌ లేకపోతే బతికే పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనిషి స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యాడని చెప్పాలి. పక్కనున్న వ్యక్తులను కూడా పట్టించుకోవడం లేదు కానీ నిత్యం సోషల్‌ మీడియాలో ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు.. స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌తో పనులన్నీ సులభంగా మారిపోయాయి అని సంతోషించాలా.? దానితో వస్తోన్న ఆరోగ్య సమస్యలను చూసి బాధ పడాలా.? తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నో రకాల మానసిక, శారీరక సమస్యలకు కారణంగా మారుతోంది స్మార్ట్ ఫోన్‌.

స్మార్ట్ ఫోన్‌ రేడియేషన్‌ ద్వారా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని తెలిసిందే. అయితే స్మార్ట్‌ ఫోన్‌ సంతానలేమికి కూడా కారణంగా మారుతోందని మీకు తెలుసా.? అవును మీరు చదివింది నిజమే. మీరు ఎంతగానో ఇష్టపడుతోన్న మీ స్మార్ట్ ఫోన్‌ మీకు శత్రువుగా మారుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటే ఈ ప్రమాదం మరీ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్‌, వేడి. మగవారి శుక్రకణాల ఉత్పత్తిపై ఇది ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్‌ను ప్యాంట్ ముందు ప్యాకెట్లో పెట్టుకుంటే శుక్ర కణాల సంఖ్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలక్రమేణ ఇది స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి కారణంగా మారుతుందని తెలిపారు. ఎన్నో అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

మొబైల్‌ ఫోన్స్‌ నుంచి వచ్చే వేడి మగవారి సంతాన సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. మొబైల్ ఫోన్‌లకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అయ్యే కొందరిని పరిగణలోకి తీసుకొని వారిపై జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కేవలం స్మార్ట్ ఫోన్‌ నుంచి వేడి మాత్రమే కాకుండా నెట్‌వర్క్‌ సిగ్నల్‌ నుంచి వచ్చే రేడియేషన్‌ కూడా స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా మొబైల్‌ ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకోవడం ద్వారా వీర్య కణాల ఉత్పత్తి 30 శాతానికి పైగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మగ ఎలుకలపై పరిశోధనలు నిర్వహించారు. సెల్‌ఫోన్‌ను నుంచి వచ్చే రేడియేషన్‌ను ఎలుకలపై గురిచేసినప్పుడు, వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్‌ ఫోన్‌ను జేబులో పెట్టుకోకూడదని, అలాగే ల్యాప్‌టాప్‌లను ఒంటిపై పెట్టుకొని ఆపరేట్ చేయకూడదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!