ఆహారం సరిగ్గా తినండి: ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి మీకు సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఆహారాన్ని నమలడం, జీర్ణం చేయడం, నిల్వ చేయడం వంటి ప్రక్రియలో మీ శరీరం కేలరీలను బర్న్ చేయాల్సి ఉంటుంది. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. ఆహారంలో ఎక్కువ సుగంధ ద్రవ్యాలు కేలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గంటల కొద్దీ ఆకలి వేయదు. జీవక్రియను నిర్వహించడానికి, కాయధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు, బీన్స్, నల్ల మిరియాలు, అవోకాడో, కాఫీ, అల్లం మొదలైనవి తీసుకోవచ్చు.