AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves Health Benefits : కరివేపాకుతో ఎన్నో ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే షాక్ అవుతారు!!

కరివేపాకు వల్ల కేవలం జుట్టుకు మాత్రమే పోషణ అందుతుంది అనుకుంటే.. మీరు పప్పులో కాలు వేసినట్లు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ కరివేపాకు తీసుకోవడం వల అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా రాకుండా చూస్తుంది. కరివేపాకులో వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కరివేపాకుతో ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. మరింకెందుకు ఆలస్యం కరివేపాకుతో..

Curry Leaves Health Benefits : కరివేపాకుతో ఎన్నో ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే షాక్ అవుతారు!!
Curry Leaves
Chinni Enni
|

Updated on: Aug 11, 2023 | 11:23 AM

Share

కరివేపాకును మనం నిత్యం ఉపయోగిస్తూ ఉంటాం. దీన్ని కూరల్లో, ముఖ్యంగా పోపుల్లో వేయడం వల్ల భలే టేస్ట్ వస్తుంది. కరివేపాకును కొందరు కారం పొడి కూడా చేసుకుని తింటారు. దీన్ని ఎక్కువగా బాలింతలకు పెడతారు. అయితే నిజానికి ఈ ఆకులను చాలామంది కూరల్లో నుంచి తీసి పడేస్తారు. కానీ దీని వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. కరివేపాకులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు.

కరివేపాకు వల్ల కేవలం జుట్టుకు మాత్రమే పోషణ అందుతుంది అనుకుంటే.. మీరు పప్పులో కాలు వేసినట్లు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ కరివేపాకు తీసుకోవడం వల అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా రాకుండా చూస్తుంది. కరివేపాకులో వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కరివేపాకుతో ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. మరింకెందుకు ఆలస్యం కరివేపాకుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందామా.

డయాబెటీస్ కంట్రోల్: ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ డయాబెటీస్ వస్తుంది. ఇలాంటి వారికి కరివేపాకు చాలా అద్భుతంగా పని చేస్తుంది. కరివేపాకు సారం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఉన్న ఇన్సులిన్ ని కరివేపాకు మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

అధిక బరువు: కరివేపాకును నిత్యం తినడం వల్ల అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకును డైలీ ఆహారంలో చేర్చుకుంటే.. కొద్ది రోజుల్లో మార్పు కనిపిస్తుంది.

వికారం: పడగడుపున కొంతమంది వికారంతో బాధపడుతూంటారు. దీంతో తలనొప్పి కూడా వస్తుంది. అలాగే గర్భిణిలు కూడా వికారంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు కరివేపాకు చక్కగా పని చేస్తుంది.

యాంటీ బ్యాక్టీరియా: కరివేపాకులో బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్ ఫెక్షన్ల బారిన పడిన వారు కూడా ఈ సమయంలో కరివేపాకు కషాయం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.

కంటి చూపు: కరివేపాకుతో కంటిచూపు మెరుగుపడుతంది. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

జ్ఞాప‌క‌శ‌క్తి: కరివేపాకుతో జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుపడుతుంది. కరివేపాకు తినడం వల్ల మెదడు యాక్టీవ్ గా ఉంటుంది కాబట్టి.. అల్జీ మర్స్ వంటి వ్యాధులు త్వరగా రావు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి