Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: అల్లం బయట కూడా ఫ్రెష్ గా ఉండాలంటే.. ఈ చిట్కాలు మీకోసమే!!

సాధారణంగా అల్లంని అందరూ ఉపయోగిస్తూంటారు. అల్లం ఉండని ఇల్లు ఉండదు అంటూ అతిశయోక్తి కాదు. ఎందుకంటే కొందరు అల్లం టీ తాగుతూంటారు. మరికొందరు వంటల్లో ఉపయోగిస్తూంటారు. వంటగదిలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. మాంసాహార వంటల్లో అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. అల్లంలో సహజ యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది ముఖ్యంగా జీర్ణక్రియను పెంచుతుంది. అంతే కాకుండా..

Kitchen Hacks: అల్లం బయట కూడా ఫ్రెష్ గా ఉండాలంటే.. ఈ చిట్కాలు మీకోసమే!!
Store Ginger For Long Time
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2023 | 6:38 AM

సాధారణంగా అల్లంని అందరూ ఉపయోగిస్తూంటారు. అల్లం ఉండని ఇల్లు ఉండదు అంటూ అతిశయోక్తి కాదు. ఎందుకంటే కొందరు అల్లం టీ తాగుతూంటారు. మరికొందరు వంటల్లో ఉపయోగిస్తూంటారు. వంటగదిలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. మాంసాహార వంటల్లో అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. అల్లంలో సహజ యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది ముఖ్యంగా జీర్ణక్రియను పెంచుతుంది. అంతే కాకుండా.. కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమం ఇస్తుంది. కాగా అల్లాన్ని చాలా మంది ఫ్రిడ్జ్ లలో స్టోర్ చేస్తారు. అలా చేస్తే అల్లం త్వరగా ఎండిపోతుంది. అలా ఫ్రిడ్జ్ లోనే కాకుండా.. బయట కూడా అల్లాన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం.

ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే ఇలా చేయండి:

*ఒక వేళ మీరు అల్లంని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలనుకుంటే.. గాలి చొరబడని ఓ జిప్ కవర్ లో గానీ, కంటైనర్స్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే అల్లం ఎండిపోదు.

ఇవి కూడా చదవండి

*కట్ చేసిన అల్లం ముక్కలు నేరుగా ఫ్రిడ్జ్ లో పెడితే పాడైపోతాయి. కాబట్టి తరిగిన అల్లంను ఫ్రిజ్ లో గాలి చొరబడని డబ్బాలో కూడా నిల్వ చేసుకోవచ్చు.

బయట స్టోర్ చేసుకోవాలంటే..

*ఫ్రిడ్జ్ లేని వారు అల్లంని బయట కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. టిష్యూ పేపర్ లేదా నార్మల్ పేపర్ లో అయినా చుట్టి జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు.

*అల్లం ఎండలో ఎక్కువగా ఉంచకుండా.. చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. అయితే స్టోర్ చేసేటప్పుడు అల్లం అస్సలు తడిగా ఉండకూడదు. బాగా ఆరిపోవాలి.

*అల్లం తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వెనిగర్, పంచదార నీరు కలిపిన మిశ్రమంలో ఉంచితే అల్లం త్వరగా పాడవ్వదు.

ఇక అల్లం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని కరెక్ట్ గా వాడితే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. అధిక బరువును తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ ను నియంత్రించడమే కాకుండా, కండరాల్లో నొప్పికి, జలుబు, దగ్గులకు ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి