Healthy Foods: వానాకాలం, చలి కాలం వేడి వేడిగా.. ఆరోగ్యంగా ఉండే ఫుడ్స్ ఇవే!!
వానాకాలం, చలి కాలాల్లో సాయంత్రం కాగానే వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపిస్తాయి. వేడి వేడి బజ్జీలు, పకోడీలే గుర్తొస్తాయి. చల్లటి వాతావరణంలో ఇలాంటివి తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. అయితే అలా నూనెలో ముంచి లేపిన ఫుడ్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదని మనకు తెలుసు. కానీ మనసు, నోరు కంట్రోల్ అవ్వదు కదా. అప్పుడప్పుడు అయితే ఓకే కానీ..

వానాకాలం, చలి కాలాల్లో సాయంత్రం కాగానే వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపిస్తాయి. వేడి వేడి బజ్జీలు, పకోడీలే గుర్తొస్తాయి. చల్లటి వాతావరణంలో ఇలాంటివి తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. అయితే అలా నూనెలో ముంచి లేపిన ఫుడ్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదని మనకు తెలుసు. కానీ మనసు, నోరు కంట్రోల్ అవ్వదు కదా. అప్పుడప్పుడు అయితే ఓకే కానీ.. రోజూ వాటిమీదే ఆధారపడేవాళ్లు మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటి వల్ల కొద్ది రోజులకు అధిక బరు,వు బీపీ, షుగర్ రావడం మాత్రం పక్కా. వచ్చిన తర్వాత బాధపడే కంటే.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
వాటి బదులు ఉడికించినవి, జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసినవి బెటర్. అంటే స్వీట్ కార్న్, పల్లీ చాట్, చాట్ మసాలా, పాప్ కార్న్ లాంటివి అలా జస్ట్ పాన్ ఫ్రై చేసి, కొంచెం చాట్ మసాలా, మిరియాల పొడి, కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే పొద్దు తిరుగుడు, గుమ్మడి గింజలు తదితరాలను సన్నటి సెగపై జస్ట్ ఒకసారి వేయించి.. వాటిలో ఉప్పు, మిరియాల పొడి, కావాలంటే నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. అలాగే ఉడకపెట్టిన చిలకడ దుంపలో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి.
పోని ఇవి బోర్ కొడితే.. మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తో వెజిటేబుల్ శాండ్ విచ్ తయారు చేసుకోవచ్చు. అందులో ఎగ్, చికెన్, పన్నీర్, కూరగాయలు పెట్టుకుని తింటే పొట్ట కూడా నిండుతుంది. వీటిని ఉదయం టిఫిన్ లా లేదా రాత్రి డిన్నర్ లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో వేరే ఇంకేమీ తినాలన్న ఆలోచనరాదు. అలాగే చేప ముక్కలను కూడా డీప్ ఫ్రై కాకుండా.. గ్రిల్ చేసుకుని తినవచ్చు. పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుని పాన్ ఫ్రై చేసుకోవచ్చు.




ఇక పెసలు, శనగలు, నాన బెట్టిన బొబ్బర్లు ఇలా రోజుకో ఐటెమ్ ని సెలెకట్ చేసుకోండి. ఆలూ టిక్కీ, పెసర్లు, శనగలు, కూరగాయలను కూడా పేస్ట్ లా చేసుకుని టిక్కీల రూపంలో చేసుకోవచ్చు. అలాగే పెరుగులో బీరకాయ, సొరకాయ లాంటి కూరగాయలు వేసి మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. ఇలా కొత్త కొత్త ఐటెమ్స్ ఎంచుకుని ఆరోగ్యంతో పాటు టేస్ట్ ని కూడా ఎంజాయ్ చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
