Nails Care Tips: గోర్లను నిర్లక్ష్యం చేస్తున్నారా.. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది!!

మన శరీరంలో గోర్లు కూడా ఒక భాగమే. చేతి, కాలి గోర్లు కూడా అందంగా కనిపించాలని కొందరు బ్యూటీ పార్లర్ల బాట పడతారు. అది కూడా మంచిదేలెండి. ఎందుకంటే గోర్లలో దాగి ఉన్న మురికి, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతాయి. అప్పుడు గోర్లను కూడా పరిశీలిస్తూ ఉండాలి. బ్యూటీ పార్లర్లకు వెళ్లకపోయినా.. ఇంట్లో సబ్బుతో, గోరువెచ్చటి నీటితో అప్పడప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఏది తిన్నా చేతులతోనే కదా.. ఆ గోర్లలో ఉన్న మురికి, […]

Nails Care Tips: గోర్లను నిర్లక్ష్యం చేస్తున్నారా.. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది!!
Nail Care
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2023 | 6:38 AM

మన శరీరంలో గోర్లు కూడా ఒక భాగమే. చేతి, కాలి గోర్లు కూడా అందంగా కనిపించాలని కొందరు బ్యూటీ పార్లర్ల బాట పడతారు. అది కూడా మంచిదేలెండి. ఎందుకంటే గోర్లలో దాగి ఉన్న మురికి, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతాయి. అప్పుడు గోర్లను కూడా పరిశీలిస్తూ ఉండాలి. బ్యూటీ పార్లర్లకు వెళ్లకపోయినా.. ఇంట్లో సబ్బుతో, గోరువెచ్చటి నీటితో అప్పడప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఏది తిన్నా చేతులతోనే కదా.. ఆ గోర్లలో ఉన్న మురికి, బ్యాక్టీరియా కూడా శరీరంలోపలికి వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి.

అయితే కాలి, చేతి గోర్లు రంగు మారితే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా కాలి గోర్లు. కాలి గోళ్లు రంగు పాలిపోవడం, మందంగా మారడం, విరిగిపోవడానికి ఫంగల్ ఇన్ ఫెక్షన్లే కారణమని చెబుతున్నారు. వైద్యుల ప్రకారం ఒనికోమైకోసిస్ కు కారణమయ్యే ఫంగస్ జీవి డెర్మాటో ఫైట్స్ శరీరంలోని కెరాటిన్ ను తీసుకొని పెరుగుతాయి. ఇది గోర్ల రంగును మారుస్తుంది.

అంటే ఆకు పచ్చ, గోధుమ, పసుపు, నలుపు రంగుల్లోకి మారుస్తుంది. మీ గోర్లు ఎప్పుడైనా ఈ రంగుల్లోకి మారితే వెంటనే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే ఇది పలు రకాల వ్యాధులకు దారి తీస్తాయని అంటున్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నా వారు లేక గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారిలో ఈ రుగ్మత కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇన్ ఫెక్షన్లను నివారించేందుకు కొన్ని చిట్కాలు మీకోసం.

ఇవి కూడా చదవండి

1. కాలి వేళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. 2. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. 3. గోర్లపై కోతలు, గాయాలు ఉంటే అవి త్వరగా మానేందుకు యాంటీబయాటిక్ క్రీమ్స్ రాయాలి. 4. ఎప్పటికప్పుడు కాళ్లను, చేతుల్ని కడుగుతూ ఉండాలి. 5. మంచి నాణ్యత గల చెప్పులు, బూట్లు ధరించాలి. 6. నాణ్యత లేని నెయిల్ పాలిష్ లు వాడకూడదు. 7. అప్పుడప్పుడు యాంటీ ఫంగల్ క్రీములను అప్లై చేస్తూ ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి