AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మనిషి అవసరం లేకుండానే గరం, గరం ఛాయ్‌.. అందుబాటులోకి ఛాయ్‌ ఏటీఎమ్‌.

ఎవరి అవసరం లేకుండా కేవలం క్యూ అర్ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా చేతికి టీ, కాఫీ, వాటర్, బిస్కెట్స్ వచ్చేస్తున్నాయి. లక్ష రూపాయలతో తయారైన ఈ మెషిన్ అందరినీ ఆకట్టుకుంటుంది.. సాధారణంగా మనం ఎయిర్‌ పోర్ట్‌లో ఇలాంటి వెండింగ్ మిషన్ చూసే ఉంటాము. కానీ ఎయిర్‌ పోర్ట్‌లో ఉన్న మిషన్లో టీ కాఫీ కాకుండా రకరకాల వస్తువులను అందులో పెట్టి ఉంటారు. అది కూడా పక్కన డబ్బులు పే చేస్తే ఆ వస్తువు...

Hyderabad: మనిషి అవసరం లేకుండానే గరం, గరం ఛాయ్‌.. అందుబాటులోకి ఛాయ్‌ ఏటీఎమ్‌.
Representative Image
Lakshmi Praneetha Perugu
| Edited By: Narender Vaitla|

Updated on: Oct 10, 2023 | 8:49 PM

Share

హైదరాబాద్‌లో మొదటి సారి WTC అందుబాటులోకి వచ్చింది. WTC అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాదండోయ్ వాటర్ టీ కాఫీ(WTC). మనిషి అవసరం లేకుండానే మిషన్ ద్వారా వాటర్, టీ, కాఫీ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన ఈ మిషన్ మన హైదరాబాదులో ప్రత్యక్షమైంది. హైదరాబాద్‌కు చెందిన వినోద్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ మిషిన్‌ను రూపొందించాడు.

ఎవరి అవసరం లేకుండా కేవలం క్యూ అర్ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా చేతికి టీ, కాఫీ, వాటర్, బిస్కెట్స్ వచ్చేస్తున్నాయి. లక్ష రూపాయలతో తయారైన ఈ మెషిన్ అందరినీ ఆకట్టుకుంటుంది.. సాధారణంగా మనం ఎయిర్‌ పోర్ట్‌లో ఇలాంటి వెండింగ్ మిషన్ చూసే ఉంటాము. కానీ ఎయిర్‌ పోర్ట్‌లో ఉన్న మిషన్లో టీ కాఫీ కాకుండా రకరకాల వస్తువులను అందులో పెట్టి ఉంటారు. అది కూడా పక్కన డబ్బులు పే చేస్తే ఆ వస్తువు మనకు వస్తుంది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న మిషన్‌లో సుమారు 36 మోటర్లతో పనిచేస్తుంది. దానికోసం స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి ఇన్‌బుల్ట్‌గా ఏర్పాటు చేస్తారు.

అయితే ఈ మిషిన్‌లు సుమారు రూ. 4 నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన వెండింగ్ మిషన్‌ కేవలం రూ. లక్షకే లభిస్తోంది. ఒక్క నిమిషంలో టీ, కాఫీ, వాటర్‌ ఇలా ఏదైనా వచ్చేస్తుంది. వినోద్ కుమార్ అనే యువకుడు ఈ మిషను తయారు చేశాడు. ఇందులో చేయవలసిందల్లా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మాత్రమే.. WTC లో మొత్తం రెండు మెషిన్లను తయారు చేశారు. ఒక మిషిన్ నుండి పూర్తిగా వాటర్ బాటిల్ వచ్చేలా చేశారు, మరో మిషన్ లో పూర్తిగా టీ , కాఫీ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మిషన్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేమెంట్ లింక్ ప్రత్యక్షమవుతుంది. ఆ లింకు క్లిక్ చేయగానే యూపీఐ పేమెంట్ చేయాలి. పేమెంట్ పూర్తవుగానే మనకి వాటర్ బాటిల్ వచ్చేస్తుంది.

Chai Atm

ఇందులో ముందుగా 100 వాటర్ బాటిల్స్, 200 టీ కాఫీ, ఒక 50 బిస్కెట్ ప్యాకెట్లను అందులో ఉంచుతారు. స్టాక్ అయిపోయిన వెంటనే నిర్వాహకుడికి అలర్ట్ వెళుతుంది. అలెర్ట్ రాగానే మళ్లీ స్టాక్ ను నింపి అందులో రెడీగా ఉంచుతారు. త్వరలో బస్టాండ్ లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మొదటిసారిగా ఎల్బీనగర్ ఎల్పిటి మార్కెట్ వేదికగా దీనిని ప్రారంభించారు. జెమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో టెక్నాలజీని ఉపయోగించి దీనిని ప్రారంభించారు. నగరవ్యాప్తంగా ఈ మిషిన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..