AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 2 Postponed: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష మళ్లీ వాయిదా.. కొత్త పరీక్ష తేదీలివే!

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షను టీఎస్పీయస్సీ మళ్లీ వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్- 2 (TSPSC Group 2) పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా పరీక్షను వచ్చే ఏడాది (2024) జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు..

TSPSC Group 2 Postponed: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష మళ్లీ వాయిదా.. కొత్త పరీక్ష తేదీలివే!
TSPSC Group 2 Postponed
Srilakshmi C
|

Updated on: Oct 10, 2023 | 9:52 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షను టీఎస్పీయస్సీ మళ్లీ వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్- 2 (TSPSC Group 2) పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా పరీక్షను వచ్చే ఏడాది (2024) జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) మంగళవారం (అక్టోబర్‌ 10) ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయడంతోపాటు కొత్త తేదీలను కూడా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 2 పరీక్ష కోసం నిరుద్యోగులు పోటీపడి ప్రిపేరవుతున్నారు. ఈ క్రమంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించడం చర్చణీయాంశంగా మారింది. గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఓసారి పరీక్ష తేదీని మార్చిన కమిషన్‌ ఇప్పుడు రెండోసారి పరీక్ష వాయిదా వేస్తూ ప్రకటన వెలువరించడం గమనార్హం. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అప్పుడు రాష్ట్రంలో వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పరీక్షలకు సన్నద్ధమవడానికి సరిపడా సమయం లేదని.. గ్రూప్‌ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు.

దీంతో గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం నవంబర్‌ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు కొత్త తేదీలను సైతం ప్రకటించింది. ఈ క్రమంలో ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన అధికారులు తాజా మరోమారు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 783 పోస్టులకు గ్రూప్‌ 2 నియమాక నోటిఫికేషన్‌ విడుదలవగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?