BRS: ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క.. రంగంలోకి దిగిన ఆ ముగ్గురు.. హైస్పీడులో దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌..

తెలంగాణలో రాజకీయం కాకరేపుతోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్‌ సీన్‌. ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశాయ్‌ పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయ్‌. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే జోరు మీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను చుట్టేస్తుంటే..

BRS: ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క.. రంగంలోకి దిగిన ఆ ముగ్గురు.. హైస్పీడులో దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌..
CM KCR - BRS Party
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 10, 2023 | 7:17 PM

తెలంగాణలో రాజకీయం కాకరేపుతోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్‌ సీన్‌. ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశాయ్‌ పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయ్‌. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే జోరు మీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను చుట్టేస్తుంటే, త్వరలో గులాబీ బాస్‌ రంగంలోకి దిగబోతున్నారు. ఈనెల 15న హుస్నాబాద్‌ సభతో సమరశంఖం పూరించనున్నారు కేసీఆర్‌. ఆ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్‌రావు కీలక కామెంట్స్‌ చేశారు. హుస్నాబాద్‌ సభ తర్వాత విపక్షాల మైండ్‌బ్లాక్‌ కావడం ఖాయమన్నారు. కేసీఆర్‌ రంగంలోకి దిగనంతవరకే విపక్షాల కుప్పిగంతులు, ఒక్కసారి గులాబీ బాస్‌ రంగంలోకి దిగారంటే వాళ్ల ఆట ముగిసినట్టే అంటూ సినిమా స్టైల్లో పంచ్‌ డైలాగ్స్‌ పేల్చారు హరీష్‌రావ్‌.

కేసీఆర్‌ సభ ఏర్పాట్లలో హరీష్‌రావు బిజీగా ఉంటే, నేతల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో ఉన్నారు కేటీఆర్‌. జనగామలో ఉప్పూనిప్పులా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య రాజీ కుదిర్చారు. ఇద్దరితో సమావేశమై నచ్చజెప్పారు. జనగామలో పల్లాను గెలిపించుకోవాలంటూ సూచించారు. దాంతో, ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా వార్‌కు తెరపడినట్టయ్యింది.

బీసీల ప్రభుత్వం.. కవిత..

మరోవైపు, ఆత్మీయ సమ్మేళనాలతో మమేకమవుతున్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌లో నాయీ బ్రాహ్మణులతో సమావేశమై బీసీల కోసం కేసీఆర్‌ ఏమేం చేశారో గుర్తుచేశారు. ఇది బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కాదు… బీసీల ప్రభుత్వమన్నారు కవిత. బీసీల అభ్యున్నతి కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే అన్నారు. రాష్ట్రం మొత్తంమీద 11లక్షల మందికి కల్యాణలక్ష్మి ఇస్తే, అందులో 7లక్షలమంది బీసీ ఆడబిడ్డలే ఉన్నారన్నారు కవిత.

కేటీఆర్‌, కవిత, హరీష్‌రావు పొలిటికల్‌ యాక్టివిటీలో బిజీబిజీగా ఉంటే, కేసీఆర్‌ సతీమణి శోభ… కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వెంటనే తిరుమల వెళ్లడం, శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకోవడం ఆసక్తిగా మారింది. సభలు, సమావేశాలు, సయోధ్యలు, టూర్లతో జోరు పెంచిన బీఆర్‌ఎస్‌… మున్ముందు ఇంకెంత దూకుడు చూపిస్తుందో చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..