WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకేసారి ఏకంగా ఐదు ఫీచర్లు.. ఆ ఫీచర్లు ఏంటంటే..

ఇప్పుడు కూడా పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇప్పటికే ఐదు కొత్త ఫీచర్లను లైన్ లో ఉంచినట్లు సమాచారం. వాట్సాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో ఈ ఐదు కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్లు వాబీటాఇన్ ఫో ఓ నివేదికలో పేర్కొంది. ఆ ఐదు ఫీచర్లు ఏంటి? వాటి ఉపయోగం ఏంటి? వినియోగదారులు వాటిని ఎలా వాడుకోవాలి? తెలుసుకుందాం రండి..

WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకేసారి ఏకంగా ఐదు ఫీచర్లు.. ఆ ఫీచర్లు ఏంటంటే..
Whatsapp
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2023 | 8:30 PM

వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్ ఫారం ఓ సంచలనం అనే చెప్పాలి. ప్రస్తుతం వాట్సాప్ ఉండని ఫోన్ లేదు.. దానిని వినియోగించని వ్యక్తీ కనబడడు. అంతలా సమాజానికి కనెక్ట్ అయిపోయింది వాట్సాప్, మెటా యాజమాన్యంలో నడిచే వాట్సాప్ వినియోగదారుల అసవరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. దానికి అనుగుణంగా కొత్త ఫీచర్లు, అప్ డేట్లు తీసుకొస్తోంది. అందుకే అంతలా జనాల్లో ఈ వాట్సాప్ కు ఆదరణ ఉంది. ఇప్పుడు కూడా పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇప్పటికే ఐదు కొత్త ఫీచర్లను లైన్ లో ఉంచినట్లు సమాచారం. వాట్సాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో ఈ ఐదు కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్లు వాబీటాఇన్ ఫో ఓ నివేదికలో పేర్కొంది. ఆ ఐదు ఫీచర్లు ఏంటి? వాటి ఉపయోగం ఏంటి? వినియోగదారులు వాటిని ఎలా వాడుకోవాలి? తెలుసుకుందాం రండి..

ఐదు కొత్త ఫీచర్లు..

వాట్సాప్ ఐదు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. సీక్రెట్ కోడ్, కొత్త చాట్ అటాచ్ మెంట్, అప్ డేట్ ట్యాబ్ లో కొత్తగా సెర్చ్ బటన్, పిన్డ్ మెసేజ్, ఐపీ అడ్రస్ ను సంరక్షించాడానికి ప్రైవసీ ప్రొటెక్ట్ వంటి ఫీచర్లను తీసుకురానుంది. వాబీటా ఇన్ ఫో రిపోర్టు ప్రకారం ఇప్పటికే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. రానున్న కొన్ని వారాల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ల గురించి విపులంగా ఇప్పుడు తెలుసుకుందాం..

సీక్రెట్ కోడ్ ఫీచర్.. లాక్ చేసిన చాట్ ల కోసం ఈ సీక్రెట్ కోడ్ ఫీచర్ వాట్సాప్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ఫోన్ ప్రధాన పాస్‌వర్డ్‌ వలే వేరే పాస్ వర్డ్ ఉంటుంది. దీని సాయంతో వినియోగదారుల చాట్ లు మరింత భద్రంగా ఉంటాయి. లాక్ చేసిన చాట్ లు ప్రత్యేకంగా ఉంటాయి. అవి మరో వ్యక్తి ఓపెన్ కావు. మీరు ఏర్పాటు చేసుకున్న పాస్ వర్డ్ పిన్ లేదా బయోమెట్రిక్ ద్వారా మాత్రమే చాట్లు ఓపెన్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

సెర్చ్ ఫీచర్ ఫర్ అప్ డేట్స్ ట్యాబ్.. కొత్త అప్ డేట్ ప్రకారం యాప్ పై భాగంలో సెర్చ్ బటన్ అందుబాటులో ఉండవచ్చు. దీని వలన స్టేటస్ అప్‌డేట్‌లు, ఫాలో అయ్యే ఛానెల్‌లు, ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకొనే వెసులబాటు ఉంటుంది.

పిన్డ్ మెసేజ్ ఫీచర్.. మీరు కోరుకున్న చాట్ ను పిన్ చేసి హైలేట్ చేసుకొనే అవకాశం ఈ ఫీచర్ ద్వారా కలుగుతుంది. మిగిలిన చాట్ లకన్నా ఈ హైలైట్ అయిన చాట్ పైభాగంలో కనిపిస్తుంది. మీరు ఎక్కువగా చాట్ చేసే వారిని ఇలా పిన్ చేసుకోవచ్చు.

కొత్తగా చాట్ అటాచ్‌మెంట్ మెనూ.. మోడ్రన్ స్టైల్ లో చాట్ అటాచ్ మెంట్ మెనూ అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త మెనూ వివిధ రకాల కంటెంట్‌ను భాగస్వామ్యం చేసే ప్రక్రియను కలిగి ఉంది.

ఐపీ అడ్రస్ కనబడకుండా ప్రైవసీ ఫీచర్.. మీరు వాట్సాప్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ ఐపీ అడ్రస్ దొరకకుండా సంరక్షించే కొత్త ప్రైవసీ ఫీచర్ ను వాట్సాప్ త్వరలో తీసుకురానుంది. వినియోగదారులు వాయిస్, వీడియో కాల్‌లను చేసేటప్పుడు ఇతర వ్యక్తులకు మీ ఐపీ అడ్రస్ దొరకకుండా ఇది కాపాడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.