Offers on Tablets: ట్యాబ్లెట్లపై బెస్ట్ డీల్స్ ఇవి.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్‌లో అతి తక్కువ ధరలకే కొనుగోలు చేయండి..
సేల్లో అనేక టెక్ గ్యాడ్జెట్లపై ఆఫర్లను అందిస్తున్నాయి. టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు,ట్యాబ్లెట్‌ల వంటి ఎలక్ట్రానిక్‌లపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. మీరు ఒకవేళ మంచి ట్యాబ్లెట్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ఇదే మంచి సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో మీకు అత్యుత్తమ ధరకు వీటిని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
భారతీయ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ ఒకేసారి తమ వార్షిక ఆఫర్ సేల్స్ ను ప్రారంభించాయి. అక్టోబర్ ఎనిమిది నుంచి సేల్స్ నడిపిస్తున్నాయి. ఈ సేల్లో అనేక టెక్ గ్యాడ్జెట్లపై ఆఫర్లను అందిస్తున్నాయి. టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు,ట్యాబ్లెట్‌ల వంటి ఎలక్ట్రానిక్‌లపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. మీరు ఒకవేళ మంచి ట్యాబ్లెట్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ఇదే మంచి సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో మీకు అత్యుత్తమ ధరకు వీటిని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఆయా వెబ్ సైట్లలో ట్యాబ్లెట్లపై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..
జియోమీ ప్యాడ్ 6.. ఈ ఏడాది ఆరంభంలో దీనిని మన దేశంలో ఆవిష్కరించారు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్ ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 11-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్ ఉంటుంది. 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. డాల్బీ అట్మోస్‌తో క్వాడ్-స్పీకర్ సెటప్ ఉంటుంది. 33వాట్ల సామర్థ్యంతో 8,840ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వచ్చే డివైస్ బేస్ వేరియంట్ బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా రూ. 23,998కి అందుబాటులో ఉంది, అయితే మీరు కొంచెం ఎక్కువ ఖర్చు చేయగలిగితే, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను మీరు రూ. 25,998కే కొనుగోలు చేయొచ్చు.
యాపిల్ ఐప్యాడ్(9వ తరం).. ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయడానికి లేదా ప్రయాణంలో కంటెంట్‌ని చూడటానికి చౌకైన ఐప్యాడ్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ యాపిల్ ఐప్యాడ్(9వ తరం) మంచి ఎంపిక కావచ్చు. వాస్తవానికి ఐఫోన్ 11లో కనిపించిన ఏ13 బయోనిక్ చిప్‌సెట్, 10.2-అంగుళాల ఐసీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌తో ఇది వస్తుంది. ఐఓఎస్ 15 ఆధారంగా పనిచేస్తుంది. 12ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు ఫోటోలు తీయడానికి 8ఎంపీ కెమెరా ఉంటుంది. దీనిని మీరు ఫ్లిప్ కార్ట్ సేల్లో రూ. 25,999కి కొనుగోలు చేయవచ్చు .
లెనోవా ట్యాబ్ పీ12.. దీనిలో 3కే 12.7-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. వెనుకవైపు, మీరు 30ఎఫ్పీఎస్ వద్ద 4కేలో వీడియోలను రికార్డ్ చేయగల 8ఎంపీ కెమెరాను పొందుతారు. ముందు వైపు వీడియో కాలింగ్ కోసం 13ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. 30వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,200ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ను రూ. 25,999 కి కొనుగోలు చేయొచ్చు.
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ ఎం1.. ఇది ఎం1 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 10.9-అంగుళాల ఐసీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌తో వస్తుంది ఐప్యాడ్ ఓఎస్ 15.4 ఆధారంగా రన్ అవుతుంది. పరికరం ముందు భాగంలో ‘సెంటర్ స్టేజ్’ సపోర్ట్‌తో 12ఎంపీ కెమెరా ఉంటుంది. అయితే దీనిలో కేవలం 64జీబీ మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. చలనచిత్రాలను చూడటం, గేమ్‌లు ఆడటం లేదా పత్రాలను నిల్వ చేయాలనుకుంటే ఇది సరిపోకపోవచ్చు. అమెజాన్‌లో రూ. 45,998కి అందుబాటులో ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8.. ఇది వేగవంతమైన శామ్సంగ్ ట్యాబ్లెట్లలో ఒకటి. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. వెనుక 13ఎంపీ ప్రైమరీ కెమెరా, 6ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 8జీబీర్యామ్, 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 256జీజీ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. 8జీబీర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర అమెజాన్ లో రూ. 48,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..