Nail biting: మీకు కూడా గోర్లు కొరికే అలవాటు ఉందా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
చిన్నప్పుడు మనం పాఠ్య పుస్తకాల్లో కూడా గోర్లను కొరడం చెడు అలవాటని చదువుకున్నాం. అయితే ఇది చెడు అలవాటు అని తెలిసినా అలవాటు కారణంగా మానుకోలేరు. పెద్దలు సైతం గోర్లు కొరకడం చూసే ఉంటాం. అయితే గోర్లను కొరకడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గోర్లలో ఉండే బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుందని అందరూ భావిస్తుంటారు. అయితే గోర్లను కొరకడం...
గోర్లు కొరకడం సర్వసాధారణమైన లక్షణం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందిలో ఇలాంటి అలవాటు చూసే ఉంటాం. దీర్ఘంగా ఆలోచిస్తున్న సమయంలో లేదా కోపంలో ఉన్న సమయంలో, మరికొందరైతే ఖాళీగా ఉన్నా గోర్లను కొరుకుతుంటారు. గోర్లను కొరకడం చెడు అలవాటు అని తెలిసినా మానుకోలేరు.
చిన్నప్పుడు మనం పాఠ్య పుస్తకాల్లో కూడా గోర్లను కొరడం చెడు అలవాటని చదువుకున్నాం. అయితే ఇది చెడు అలవాటు అని తెలిసినా అలవాటు కారణంగా మానుకోలేరు. పెద్దలు సైతం గోర్లు కొరకడం చూసే ఉంటాం. అయితే గోర్లను కొరకడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గోర్లలో ఉండే బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుందని అందరూ భావిస్తుంటారు. అయితే గోర్లను కొరకడం వల్ల దంతాలకు కూడా హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన వైద్యులు ఈ విషయాలను వెల్లడించారు.
గోరు కొరకడం వల్ల దంతాలు పగిలిపోయే అవకాశం ఉందని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ చెబుతోంది. దీనివల్ల దంతాల మీద ఉండే రూట్ తొలగిపోతుంది. ఇది పళ్లు ఊడిపోవడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక గోడర్లను కొరకడం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా నోటిలోకి చేరుతుంది. గోర్లలో కంటికి కనిపించని ఇకోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగాలు వ్యాపించడానికి కారణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ బ్యాక్టీరియా గోర్ల నుంచి నోట్లికి వెళ్లడం వల్ల పేగులకు వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన జీర్ణాశయ వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక గోర్లు కొరికే అలవాటు ఉన్న వారిలో బ్రక్సిజమ అనే అలవాటుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలో పళ్లు కొరికే అలటుగా మారుతందని చెబుతున్నారు. దీంతో తలనొప్పి, ముఖం నొప్పి, చిగుళ్లు వాపు, దంతాలు విరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పిల్లలు, యుక్త వయసు వాళ్లు గోరు కొరకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
కొన్ని అంచనాల ప్రకారం సుమారు 40 శాతం మంది పిల్లలు, యువకులు గోర్లు కొరుకుతున్నారని చెబుతున్నాయి. గోర్లను కొరకడం అలవాటును తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇందుకోసం గోళ్లను చిన్నగా కత్తిరించాలి. చిన్న పిల్లల్లో ఈ అలవాటును మాన్పించడానికి ఏదైనా చేదు రుచి కలిగిన నెయిల్ పాలిష్ వేయాలి. దీంతో గోర్లు కొరకడం అలవాటు తగ్గుతుంది. ఇక గోర్లు కొరకాలనే ఆలోచనగానే రాగానే చాక్లెట్ లాంటిది ఏదైనా తినడం అలవాటు చేసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..