Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lipstick Tips: అధరాలు మరింత అందంగా మెరవాలంటే.. లిప్‌స్టిక్‌ వేసుకునేటప్పుడు ఈ టిప్స్‌ మర్చిపోకండి

అందానికి మెరుగులు దిద్దడానికి ఆడవారు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంటారు. అందుకే కొందరు మేకప్‌ రంగులు అద్దుకుని మురిసిపోతుంటారు. ఐతే మేకప్‌ తర్వాత అదరాలకు లిప్‌స్టిక్‌ అద్దకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. లిప్‌స్టిక్‌ వేసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ముఖానికి సరిగ్గా నొప్పదు. లిప్ స్టిక్ ఎవరి దృష్టినైనా ఆకర్షించగల కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. అందువల్ల వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ముఖ ఛాయకు సరిపోయే లిప్‌స్టిక్ రంగును మాత్రమే వినియోగించాలి..

Srilakshmi C

|

Updated on: Oct 10, 2023 | 7:48 PM

అందానికి మెరుగులు దిద్దడానికి ఆడవారు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంటారు. అందుకే కొందరు మేకప్‌ రంగులు అద్దుకుని మురిసిపోతుంటారు. ఐతే మేకప్‌ తర్వాత అదరాలకు లిప్‌స్టిక్‌ అద్దకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది.

1 / 5
మీ పెదవుల రంగు ముదురు రంగులో ఉంటే లేత రంగు లిప్‌స్టిక్‌లు సరిపోవు. అలాగే పగిలిన పెదవులకు కూడా లిప్ స్టిక్ అంతగా బావుండదు. పొడి వాతావరణంలో పెదవులు తేమను కోల్పోతాయి. అందువల్లనే చలికాలం రాగానే పెదాలు పగలడం మొదలవుతుంది. శీతాకాలంలో పెదాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెదవులు వాడిపోతాయి. పెదవుల రంగు నల్లగా మరి అందవిహీనంగా కనిపిస్తాయి.

2 / 5
ముదురు ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుంది. ఎరుపు రంగులో ఉండే లిప్‌స్టిక్‌ వేసుకుంటే ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సరైన పద్ధతిలో లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టిని ఇట్టే ఆకర్షించవచ్చు. సన్నటి పెదవులు కలిగినవారు లిప్ స్టిక్ రాసుకుంటే పెదవులు కొద్దిగా ఒత్తుగా కనిపిస్తాయి. తద్వారా ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

3 / 5
లిప్ స్టిక్ వేసుకునే ముందు పెదాలకు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. తర్వాత లిప్‌స్టిక్‌కు సరిపోయే లిప్ లైనర్‌ను ఉపయోగించాలి. తద్వారా పెదవుల అంచులు బ్రైట్‌గా కనిపిస్తాయి. లిప్ స్టిక్ వేసుకునేటప్పుడు పెదవుల మధ్యభాగం నుంచి ప్రారంభించి.. పెదవుల సహజ ఆకృతిని అనుసరించి చివర వరకు వేసుకోవాలి. చివరగా, పెదవులు మెరిసేలా చేయడానికి లిప్ గ్లాస్ వేసుకోవాలి.

4 / 5
మీ స్కిన్ టోన్‌ను బట్టి.. తెలుపు రంగు స్కిన్ టోన్ వారు న్యూడ్ పింక్, లేత ఊదా రంగు లేదా మ్యాట్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయవచ్చు. వీట్ టోన్ లేదా గోధుమ రంగు ఛాయవారు ముదురు రంగులను ఉపయోగించవచ్చు. మీ స్కిన్ టోన్ ముదురు రంగులో ఉంటే మీరు మెరూన్ లేదా బ్రౌన్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయవచ్చు. రెడ్ లిప్ స్టిక్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. ఈ రంగు లిప్ స్టిక్ అన్ని రకాల ఛాయల కలిగిన వారికి సరిపోతుంది.

5 / 5
Follow us