AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ఆ గన్స్ సరెండర్ చేయండి.. సీపీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ..

Hyderabad, October 11: ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడమే ఆలస్యం.. పట్టివేత కార్యక్రమం స్పీడందకుంది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ఇలా వచ్చిందో లేదో నాకా బందీ మొదలు పెట్టారు పోలీసులు. ఇంకేముంది. టచ్‌ చేస్తే కరెన్సీ కట్టలు జిగేల్మన్నాయి. 2 వేలనోటు కథ ఒడిసిపోవడంతో ఇప్పుడంతా 5వందల పచ్చ నోట్లను గుట్టుగా గట్టు దాటించే యవ్వారాలు జోరందుకున్నాయి. పక్కా నిఘా పెట్టిన పోలీసులు నోట్ల బట్వాడా నకరాలకు ఎక్కడికక్కడ కళ్లెం వేస్తున్నారు.

Telangana Elections: ఆ గన్స్ సరెండర్ చేయండి.. సీపీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ..
Cp Cv Anand
Shiva Prajapati
|

Updated on: Oct 11, 2023 | 9:31 AM

Share

Hyderabad, October 11: ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడమే ఆలస్యం.. పట్టివేత కార్యక్రమం స్పీడందకుంది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ఇలా వచ్చిందో లేదో నాకా బందీ మొదలు పెట్టారు పోలీసులు. ఇంకేముంది. టచ్‌ చేస్తే కరెన్సీ కట్టలు జిగేల్మన్నాయి. 2 వేలనోటు కథ ఒడిసిపోవడంతో ఇప్పుడంతా 5వందల పచ్చ నోట్లను గుట్టుగా గట్టు దాటించే యవ్వారాలు జోరందుకున్నాయి. పక్కా నిఘా పెట్టిన పోలీసులు నోట్ల బట్వాడా నకరాలకు ఎక్కడికక్కడ కళ్లెం వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఇక హైదరాబాద్‌లో రౌండ్‌ ది క్లాక్ డేగకళ్లతో నగర నలుమూలా క్లోజ్గా వాచ్‌ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆదిలో కోట్లలో కరెన్సీ పట్టుబడింది. ఇటు మనీ బట్వాడా సహా మరోవైపు వెపన్స్‌పై కూడా దృష్టిసారించారు పోలీసులు. గన్‌ లైసెన్స్‌ హోల్డర్స్‌కు కీలక ఉత్తర్వులు జారీ చేవారు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.

ఎవరెవరి దగ్గర ఆయుధాలున్నాయో వాటిని తప్పనిసరిగా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేయాలన్నది సారాంశం. ఈ నెల 16లోపు వెపన్స్‌ను ఠానాల్లో డిపాజిట్‌ చేయాలని ఆదేశించారు సీపీ ఆనంద్‌. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారాయన. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు నిఘా కొనసాగుతుందన్నారు. లైసెన్స్డ్‌ వెపన్స్‌ను డిపాజిట్‌ చేసిన వాళ్లు డిసెంబర్‌ 10 తరువాత వాటిని తిరిగి తీసుకోవచ్చాన్నారు సీపీ ఆనంద్‌. ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా, సజావుగా కొనసాగేలా ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. రూల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రౌడీ షీటర్స్‌పై మరింత నిఘా పెంచారు. ఎక్కడైనా ఎవరైనా అక్రమాలకు బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు.

తెలంగాణలో లైసెన్స్‌ కలిగిన వారు..

తెలంగాణలో ఇప్పటి వరకు 9,810 మందికి లైసెన్స్‌డ్ గన్స్ జారీ చేసింది పోలీశాఖ. 2018 ఎన్నికల సమయంలో ఈ సంఖ్య 9,070 ఉండగా.. ఈ ఐదేళ్ల కాలంలో కొత్తగా 740 మందికి గన్ లైసెన్స్ జారీ చేశారు. వీరిలో భద్రతా సిబ్బంది, క్రీడాకరులు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు ఇలా ఉంటే.. హైదరాబాద్‌ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే 5 వేలకు పైగా గన్ లైసెన్స్‌లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులోనూ.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్‌నగర్ పాతబస్తీలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక దేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే.. తెలంగాణలో గన్ లైసెన్స్ కలిగిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అత్యధికంగా కర్నాకట రాష్ట్రంలో గన్ లైసెన్స్‌లు జారీ చేశారు. ఈ రాష్ట్రంలో ఏకంగా 1,20,719 గన్ లైసెన్స్‌లు ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో తమిళనాడు (24,237), కేరళ (11,330), తెలంగాణ (9,810), ఆంధ్రప్రదేశ్‌ (7,007) ఉన్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో తుపాకీ లైసెన్సులే లేవని కేంద్రం ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..