టైమింగ్స్ మార్చండి మహా ప్రభో..! ఈ రూట్లో వందేభారత్ ఎక్కాలంటే.. ఒక రోజు ఆఫీస్ డుమ్మా కొట్టాల్సిందే..!
ప్రయాణికులకు సులువైన ప్రయాణం, ఐటి, ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నిరుపయోగంగా మారింది. రైలు టైమ్ షెడ్యూల్, చాలా మంది ఐటి ఉద్యోగుల టైమింగ్స్‌కు చాలా వ్యత్యాసం ఉంటోంది. దీంతో కాచిగూడ- యశ్వంత్‌పూర్ వందేభారత్ రైల్లో ప్రయాణించే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఈ రైలు ప్రయాణం ఆశించిన మేరకు సంతృప్తికరంగా లేదంటున్నారు.
హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ రైలును సెప్టెంబర్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే ఈ రైలు.. మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, అనంతపురం, ధర్మవరం స్టేషన్ల మీదుగా నడుస్తుంది. ఈ వందే భారత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ రైలును ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు వివరించారు. ఈ దేభారత్ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైదరాబాద్, బెంగళూరులోని రెండు ఐటి హబ్‌ల మధ్య ప్రయాణ సమయం, దురాన్ని తగ్గించడానికి ఈ రైలును ప్రవేశపెట్టారు. ప్రయాణికులకు సులువైన ప్రయాణం, ఐటి, ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నిరుపయోగంగా మారింది. రైలు టైమ్ షెడ్యూల్, చాలా మంది ఐటి ఉద్యోగుల టైమింగ్స్‌కు చాలా వ్యత్యాసం ఉంటోంది. దీంతో కాచిగూడ- యశ్వంత్‌పూర్ వందేభారత్ రైల్లో ప్రయాణించే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఈ రైలు ప్రయాణం ఆశించిన మేరకు సంతృప్తికరంగా లేదంటున్నారు.
కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య దూరం దాదాపు 610 కిమీ. వందే భారత్ రైలులో ప్రయాణానికి 8.30 గంటలు పడుతుంది. ఏదైన అంతరాయం ఏర్పడితే..10 గంటలు కూడా పడుతుంది. IT ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొత్తగా ప్రవేశపెట్టిన రైలు పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ, దాని టైమింగ్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాట్లాడుతూ.. వందేభారత్ రైలులో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి తాము.. ఒకరోజు ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. వందేభారత్ షెడ్యూల్ చాలా మంది ఉద్యోగులకు అనువైనదిగా లేదన్నారు. అయితే, ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి ఇది సమస్య కాదని చెప్పారు.
ప్రస్తుతం, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుండి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి, మహబూబ్‌నగర్ (ఉదయం 6.49), కర్నూలు సిటీ (ఉదయం 8.24), అనంతపురం (ఉదయం 10.44), ధర్మవరం (ఉదయం 11.14) మీదుగా యశ్వంతపూర్ జంక్షన్‌కు మధ్యాహ్నం 2.00 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుండి ప్రజలు వారి ఆఫీసు లేదా ఇంటికి చేరుకునే సమయం దాదాపు మరో రెండు గంటలు పట్టే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం అవుతుంది. అంటే, రోజంతా ప్రయాణానికే సరిపోతుంది. ఇక, తిరుగు ప్రయాణ సమయం కూడా ఇలాగే ఉంటుంది. యశ్వంత్‌పూర్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. బెంగళూరు ట్రాఫిక్‌ను అధిగమించి.. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి, రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. కూకట్‌పల్లి, మియాపూర్ వంటి ప్రదేశాలలో ఉన్న వారు తమ ఇళ్లకు చేరుకోవడానికి అర్ధరాత్రి దాటుతుంది. హైదరాబాద్-బెంగుళూరు మధ్య తరచూ ప్రయాణించే యువకుడు రాత్రి 9 గంటలకు బస్సు ఎక్కి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటారు.
సమయాభావం దృష్ట్యా, వందేభారత్ రైలు టైమింగ్స్ మార్చాలని రైల్వే అధికారులను అభ్యర్థిస్తున్నారు ఉద్యోగులు. రైలు యశ్వంత్‌పూర్‌కి మధ్యాహ్నం 12 గంటలలోపు చేరుకుంటే బాగుంటుంది. అప్పుడు, కనీసం సగం రోజు పని చేయడానికి కొంత అవకాశం ఉంటుందని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..