PM Naredra Modi: భారత్ వెలిగిపోతోంది.. ఐఎంఎఫ్ నివేదికపై ప్రధాని మోదీ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి(జీడీపీ) అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి స్వల్పంగా పెంచింది. అంతకు ముంది 6.1 శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు దానిని 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఐఎంఎఫ్. అదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటు తగ్గిస్తూ అంచనాలు వేసింది. దాదాపు 3 శాతం మేర ప్రపంచ వృద్ధి రేటును అంచనా వేస్తూ నివేదిక విడుదల చేసింది..
New Delhi, October 11: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి(జీడీపీ) అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి స్వల్పంగా పెంచింది. అంతకు ముంది 6.1 శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు దానిని 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఐఎంఎఫ్. అదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటు తగ్గిస్తూ అంచనాలు వేసింది. దాదాపు 3 శాతం మేర ప్రపంచ వృద్ధి రేటును అంచనా వేస్తూ నివేదిక విడుదల చేసింది అంతర్జాతీ ద్రవ్య నిధి సంస్థ. ఈ నివేదికపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు ప్రధాని.
‘ఇది మా ప్రజల బలం, నైపుణ్యాల కృషి ఫలితం. భారతదేశం ప్రపంచ ప్రకాశవంతమైన ప్రదేశం. వృద్ధి, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా నిలుస్తోంది. సంపన్న భారతదేశం వైపు మా ప్రయాణాన్ని బలోపేతం చేస్తూ, మా సంస్కరణల పథాన్ని మరింత పెంచుతూనే ఉంటాం.’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
‘భారత్‌లో వృద్ధి 2023-2024 సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి రేటు 6.3 శాతంతో బలంగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 2023కి 0.2 శాతం పాయింట్స్ పెంచుతూ సవరించడం జరిగింది. ఇది ఏప్రిల్-జూన్ సమయంలో ఊహించిన దానికంటే బలమైన వినియోగాన్ని ప్రతిబింబిస్తుంది.’ అని ఐఎంఎఫ్ పేర్కొంది.
ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 5.4%గా అంచనా వేసింది. అదే సమయంలో GDP వృద్ధి 6.5%గా ఉంది. మానిటరీ పాలసీ అంచనాలు మధ్యకాలిక కాలంలో ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడానికి అనుగుణంగా ఉన్నాయని IMF తెలిపింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో దేశం కరెంట్ ఖాతా లోటు GDPలో 1.8%గా ఉంటుందని IMF తెలిపింది.
Powered by the strength and skills of our people, India is a global bright spot, a powerhouse of growth and innovation. We will continue to strengthen our journey towards a prosperous India, further boosting our reforms trajectory. https://t.co/CvHw4epjoZ
— Narendra Modi (@narendramodi) October 10, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..