AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: శనివారం హైదరాబాద్ వస్తున్నారా? అయితే, ఇది తప్పక తెలుసుకోండి..

హైదరాబాద్, అక్టోబర్ 13: TSPSC వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారనీ.. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14 న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపునిచ్చాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన,,

Hyderabad: శనివారం హైదరాబాద్ వస్తున్నారా? అయితే, ఇది తప్పక తెలుసుకోండి..
Sadak Bandh In Telangana
Follow us
TV9 Telugu

| Edited By: Shiva Prajapati

Updated on: Oct 13, 2023 | 1:11 PM

హైదరాబాద్, అక్టోబర్ 13: TSPSC వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారనీ.. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14 న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపునిచ్చాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, బీఎస్‌పి, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. అక్టోబర్ 14 వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి 12.30 వరకూ జరిగే ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా పాల్గొనాలని కోరారు.

రాస్తారోకో నిర్వహించే రహదారులు ఇవే..

1. మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ రహదారిలో మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్

2. వరంగల్ నుండి హైదరాబాద్ రహదారిపై వరంగల్, స్టేషన్ ఘనపూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఘట్‌కేసర్.

ఇవి కూడా చదవండి

3. రామగుండం నుండి హైదరాబాద్ రహదారిపై రామగుండం పెద్దపల్లి, కరీం నగర్, సిద్దిపేట, గజ్వేల్, శామీరు పేట, తూమకుంట.

4. ఖమ్మం నుండి హైదరాబాద్ రహదారిలో ఖమ్మం, కూసుమంచి, సూర్యాపేట, నకిరేకల్‌, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్, హయత్ నగర్.

డిమాండ్లివే..

1. ప్రస్తుత బోర్డు చైర్మన్‌తో సహా TSPSC సభ్యులను తొలగించి,TSPSC చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలి.

2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి.

3. డీఎస్సీ పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 కు పెంచాలి. (బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా )

4. పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..