Telangana Elections: నేను వస్తాను.. మీకు వచ్చే దమ్ముందా.. అక్బరుద్దీన్ సవాల్‌కు సిద్ధమన్న రేవంత్‌రెడ్డి..
Revanth Reddy Vs Akbaruddin: చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో తనకున్న అనుబంధం గురించి ప్రమాణం చేయాలని కోరిన ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ సవాలును తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి గురువారం స్వీకరించారు.నేను వస్తాను.. మీకు వచ్చే దమ్ముందా.. అంటూ సవాల్ విసిరారు.
హైదరాబాద్, అక్టోబర్ 13: ఎన్నికలు సమీపిస్తన్న వేళ తెలంగాణల రాజకీయనేతల సవాళ్ల పర్వం హీటెక్కిస్తుంది. రేవంత్ ముమ్మాటికీ RSS వ్యక్తే.. కాదని నిరూపించుకోవాలంటే చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రమాణం చెయ్యాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన సవాల్‌కు తాను రెడీ అన్నారు రేవంత్‌రెడ్డి. అక్బరుద్దీన్ కూడా మోడీ, అమిత్‌షా, యోగి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు తాను సిద్ధం.. మీరు సిద్ధంగా ఉన్నారా? అని రేవంత్ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు.
“నేను వచ్చి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆలయాని రావడం ఎప్పుడు ప్రారంభించారో నాకు చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లేదా మరెవరైనా ఆలయాన్ని సందర్శిస్తే ఫర్వాలేదు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

