Hyderabad: అశోక్‌నగర్‌లో యువతి ఆత్మహత్య.. ప్రభుత్వమే కారణమంటూ అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..

Hyderabad News: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని ప్రవల్లిక రాత్రి సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తనను క్షమించాలంటూ సూసైడ్ లెటర్ రాసింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హాస్టల్ వద్దకు చేరుకున్నారు.

Hyderabad: అశోక్‌నగర్‌లో యువతి ఆత్మహత్య.. ప్రభుత్వమే కారణమంటూ అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..
Pravallika Suicide
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 14, 2023 | 7:12 AM

హైదరాబాద్, అక్టోబర్ 14: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని ప్రవల్లిక రాత్రి సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తనను క్షమించాలంటూ సూసైడ్ లెటర్ రాసింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హాస్టల్ వద్దకు చేరుకున్నారు. యువతి మృతికి ప్రభుత్వమే కారణం అంటూ అర్థరాత్రి వేళ అశోక్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయడం వల్లే యువతి ఆత్మహత్య చేసుకుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ స్థాయిలో విద్యార్థులు రోడ్డు మీదకు రావడంతో.. అశోక్‌నగర్ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులను ఈడ్చుకెళ్లారు పోలీసులు. దాంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

ప్రభుత్వ అలసత్వం వల్ల వరుసగా పోటీ పరీక్షలు వాయిదా పడడంతోనే విద్యార్థిని కుంగిపోయిందని ఆరోపించాయి విద్యార్థి సంఘాలు. అటు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. బీజేపీ నేత లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అనంతరం భారీగా గుమిగూడిన విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టారు.

పోలీసులు చెబుతున్న వెర్షన్ ఇదీ..

ప్రవల్లిక 15 రోజుల క్రితమే హాస్టల్‌కు వచ్చిందన్నారు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు. అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉండేదన్నారు. నిన్న రాత్రి తన రూమ్‌మేట్స్‌ భోజనానికి వెళ్లిన సమయంలో సూసైడ్‌ చేసుకుందని చెబుతున్నారు.

విద్యార్థులు చెబుతున్న వివరాలు..

మృతురాలు వరంగల్ జిల్లాకు దుగ్గొంది మండలం, బిక్కోజిపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక(23)గా గుర్తించారు పోలీసులు. ప్రవల్లిక గత రెండు సంవత్సరాలుగా కాంపిటీటీవ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది. గ్రూప్ – 2 కి అప్లై చేసిన ప్రవల్లిక.. అశోక్‌ నగర్‌లో గర్ల్స్ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటోంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన గ్రూప్ 2 ఎగ్జామ్.. మళ్లీ వాయిదా పడటంతో ప్రవల్లిక తీవ్ర మనస్తాపానికి గురైంది. వేలకు వేలు డబ్బు పెట్టి కోచింగ్ తీసుకోవడం.. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం భారంగా మారడంతో పాటు.. ఎగ్జామ్స్‌ మళ్లీ వాయిదా పడటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువతి హాస్టల్‌లో రూమ్‌మేట్స్ భోజనం చేసేందుకు కిందకు వెళ్లగా.. తాను ఒక్కతే గదిలో ఉండి ఆత్మహత్యకు పాల్పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..