AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్.. వారి ఆశలన్నీ అడియాశలేనా?!

Telangana Polls 2023: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆశావాహుల్లో రోజుకో కొత్త టెన్షన్‌ కనిపిస్తోంది. ఇంటికి రెండు లేదా మూడు టికెట్లు కావాలంటూ కీల‌క‌నేత‌ల ప‌ట్టు ఓ ప‌క్క, బీసీల‌కు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గానికో అసెంబ్లీ సీటు ఇవ్వాల‌న్న డిమాండ్ మ‌రో ప‌క్క, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన ఆశావ‌హుల డిమాండ్లు ఇంకో పక్క టీ కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌పై స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ మాట్లాడారు.

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్.. వారి ఆశలన్నీ అడియాశలేనా?!
Telangana Congress
Shiva Prajapati
|

Updated on: Oct 14, 2023 | 8:18 AM

Share

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్‌ మొదలైంది. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను అనుసరించి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందనే ప్రచారంతో ఆశావాహుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. ఒకటికన్నా..ఎక్కువ టిక్కెట్లు ఆశిస్తున్న వారసుల కుటుంబీకుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా..? ఇంతకీ.. ఏం జరగనుంది? ప్రత్యేక కథనం మీకోసం..

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆశావాహుల్లో రోజుకో కొత్త టెన్షన్‌ కనిపిస్తోంది. ఇంటికి రెండు లేదా మూడు టికెట్లు కావాలంటూ కీల‌క‌నేత‌ల ప‌ట్టు ఓ ప‌క్క, బీసీల‌కు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గానికో అసెంబ్లీ సీటు ఇవ్వాల‌న్న డిమాండ్ మ‌రో ప‌క్క, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన ఆశావ‌హుల డిమాండ్లు ఇంకో పక్క టీ కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌పై స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ మాట్లాడారు. ఇక ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని, మైనార్టీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.

ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ప్రకారమే ఆశావాహులకు సీట్లు దక్కితే.. తమతోపాటు వారసులను రంగంలోకి దించాలని భావిస్తున్న వారి ఆశలు గల్లంతైనట్లేనా? కాంగ్రెస్‌ పార్టీలో దాదాపు 9 కుటుంబాలు వారసులు, కుటుంబసభ్యులకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వారిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఈ సారి తన ఇద్దరు కుమారులను రంగంలోకి దించారు. పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి కోసం ఆయన నాగార్జున సాగర్, మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్నారు. సకుటుంబ సమేతంగా టికెట్లు ఆశిస్తున్న నేతల్లో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. తనతో పాటు తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే పనిలో ఉన్నారాయన. తాను హుజూర్‌నగర్ నుంచి, కోదాడ నుంచి పద్మావతి కోసం అప్లై చేశారాయన. మరో సీనియర్‌ నేత దామోదర రాజనరసింహ తనతో పాటు తన కుమార్తెకూ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా తనతో పాటు తన కుమారుడు సూర్య కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ములుగు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సీతక్క, తన కుమారుడు సూర్య కోసం పినపాక టికెట్‌ కోరుతున్నారు. మరో సీనియర్‌ నేత అంజన్‌కుమార్‌యాదవ్ తనతో పాటు తన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్‌‌కు టికెట్లు ఇవ్వాలంటున్నారు. కొండా మురళి, కొండా సురేఖ కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ఇక మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపాటి హన్మంతరావు తనకు, తన కుమారుడికి టికెట్లు ఖరారయ్యాకే కాంగ్రెస్‌ పార్టీలో చేరారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ ఉదయ్‌పూర్‌ తీర్మానం ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్‌ ఇవ్వొద్దనే నిబంధన ఉంది. మరి ఈ నేతలకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ టికెట్లు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..