Telangana Congress: అందుకే పొన్నాల రాజీనామా.. సంచలన కామెంట్స్ చేసిన వీహెచ్

కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడటంపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. పొన్నాల లక్ష్మయ్యను అవమానించారు కాబట్టే రాజీనామా చేశారని అన్నారు. మీడియాతో మాట్లాడిన వీహెచ్.. పొన్నాల రాజీనామాపై తనదైన శైలిలో స్పందించారు. పొన్నాలను బాధ పెట్టారని, జనగామలో ఆయనకు ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. తన గోడును ఎన్నోసార్లు పీసీసీకి చెప్పుకున్నారని..

Telangana Congress: అందుకే పొన్నాల రాజీనామా.. సంచలన కామెంట్స్ చేసిన వీహెచ్
V Hanumantha Rao
Follow us
Shiva Prajapati

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 14, 2023 | 11:53 AM

హైదరాబాద్, అక్టోబర్ 14: కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడటంపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. పొన్నాల లక్ష్మయ్యను అవమానించారు కాబట్టే రాజీనామా చేశారని అన్నారు. మీడియాతో మాట్లాడిన వీహెచ్.. పొన్నాల రాజీనామాపై తనదైన శైలిలో స్పందించారు. పొన్నాలను బాధ పెట్టారని, జనగామలో ఆయనకు ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. తన గోడును ఎన్నోసార్లు పీసీసీకి చెప్పుకున్నారని తెలిపారు. పొన్నాల రాజీనామా కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా నష్టాన్నే కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు వీహెచ్. పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా పనిచేసిన నేతకే అలాంటి పరిస్థితి ఉంటే ఎలా? మిగతా నేతల పరిస్థితి ఏంటి? అని అన్నారు. పొన్నాల రాజీనామా కచ్చితంగా కాంగ్రెస్‌కు నష్టమే అన్న వీహెచ్.. బెదిరించేవాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీపై విశ్వాసంతో, నమ్మకంగా ఉన్నవారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు వీహెచ్.

తక్కువ శాతం జనాభా ఉన్నోళ్లకు ఎక్కువ సీట్లిస్తే.. 54 శాతం ఉన్న బీసీలు ఏం కావాలి? అని ప్రశ్నించారు వీహెచ్. బీసీ డిక్లరేషన్‌ ప్రకటించకపోతే కాంగ్రెస్‌ నష్టపోతుందని హెచ్చరించారాయన. బీసీల ఆవేదనను హైకమాండ్‌ పట్టించుకోవాలని, బీసీ నేతలు కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆదేశాలతోనే తాము నోరు మూసుకున్నామని చెప్పుకొచ్చారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి ఏళ్ల పాటు సేవలందించి.. మంత్రిగా, టీపీసీసీ తొలి చీఫ్‌గా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య.. తీవ్ర మనస్తాపంతో శుక్రవారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీకి వచ్చి 10 రోజులైనా అధిష్టానం ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వలేదని పొన్నాల వాపోయారు. ఇది బీసీలకు జరుగుతోన్న అవమానమంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పార్టీలో ఉండబోయేది లేదంటూ, పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..