AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veena-Vani Birthday: నేడే అవిభక్త కవలలు వీణ వాణిల పుట్టినరోజు.. చార్టెడ్ అకౌంట్ కావాలని కలలు కంటున్న వీణ వాణిలు..

అవిభక్త కవలలు అని అనగానే వీణా వాణి గుర్తొస్తారు. వీరి పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఆవిభక్త కవలలు నేటికీ 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. హైదరాబాదు లోని నీలోఫర్ హాస్పిటల్ లో 2002 అక్టోబర్ 16న జన్మించారు.  పుట్టినప్పటి నుంచి 13 ఏళ్ల పాటు నీలోఫర్ లోనే ఉన్నారు.

Veena-Vani Birthday: నేడే అవిభక్త కవలలు వీణ వాణిల పుట్టినరోజు.. చార్టెడ్ అకౌంట్ కావాలని కలలు కంటున్న వీణ వాణిలు..
Conjoined Twins Veena Vani
Peddaprolu Jyothi
| Edited By: Surya Kala|

Updated on: Oct 16, 2023 | 10:05 AM

Share

ఆ అవిభక్త కవలల ఆరాటం ముందు ఆటంకం చిన్నబోయింది. ఆ ఇద్దరు తలలు ఒక్కటే, తెగింపు ఒక్కటే.. వైకల్యంతో చిన్నప్పటినుండి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు ఆ చిన్నారులు. ఎవరు విడదీయలేని బంధం వారిద్దరిది. ఒకరు లేకుండా మరొకరు ఉండలేరు. ఆ ఇద్దరికి ఆ ఇద్దరే తోడు నీడ.. ఎవరి సహాయం లేకుండా 17 సంవత్సరాలు ఆ అవిభక్తలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి వీణా వాణిల పుట్టిన రోజు నేడు..

అవిభక్త కవలలు అని అనగానే వీణా వాణి గుర్తొస్తారు. వీరి పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఆవిభక్త కవలలు నేటికీ 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. హైదరాబాదులోని నీలోఫర్ హాస్పిటల్ లో 2002 అక్టోబర్ 16న జన్మించారు.  పుట్టినప్పటి నుంచి 13 ఏళ్ల పాటు నీలోఫర్ లోనే ఉన్నారు. ఈ అవిభక్త కవలలు తర్వాత యూసఫ్ గూడాలో ఉన్నటువంటి స్టేట్ హోమ్ కు తరలించారు. ఈ అవిభక్త కవలలను శస్త్ర చికిత్సతో సెపరేట్ అంశంపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం సహా మూడు వైద్య నిపుణుల కమిటీలు అధ్యయనం చేశాయి. అయితే వీరిద్దరిని సపరేట్ చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు తేల్చడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.

గతంలోనూ నీలోఫర్ హాస్పిటల్ లో ఆ చిన్నారులు ఉన్నప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆ ఇద్దరినీ వేరు చేయాలని దేశ విదేశాల్లో ఉన్నటువంటి వైద్య నిపుణులు సైతం తీసుకొని రావడం జరిగింది. అయినప్పటికీ అది ఫలించకపోవడంతో ఆ ఇద్దరు ఈనాటి వరకు అలానే ఉన్నారు. ప్రస్తుతం వీరు స్టేట్ హోమ్ లో ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు. అందరిలాగానే ఆ ఇద్దరు కూడా తమ పుట్టినరోజు వేడుకలను ఇంట్లో జరుపుకోవాలని ఆశగా ఉన్నప్పటికీ తమకు మొదటి నుంచి అలవాటు అయినటువంటి స్టేట్ హోమ్ లోని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందని ఆ అవిభక్త కవలలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు పుట్టినరోజు వచ్చినా తల్లిదండ్రులు వీణ వాణిల దగ్గరకు వచ్చి పుట్టిన రోజు వేడుకలను జరుపుతారు.  వీణావాణీలు మాత్రం స్టేట్ హోమ్ లోని పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటారు.. ఇంటర్ పూర్తి చేసుకున్న ఈ అవిభక్త కవలలు ఎవరి సహాయం లేకుండానే పరీక్షల్లో రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధించారు.  ఆ ఇద్దరు చార్టెడ్ అకౌంట్ కావాలని కలగంటున్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి వారి ఉన్నత విద్యకు సహాయ సహకారాలు అందేలా చూస్తున్నారు. 18 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వీణ వాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..