CM KCR: చిలిపి పనులు వద్దు.. అడ్డంగా బుక్ చేస్తారు.. పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు

BRS Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. ఆదివారం నాడు(అక్టోబర్ 15) తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. ఈ బీఫామ్స్ ఇచ్చే సమయంలో అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు కేసీఆర్. బీఫామ్స్ నింపే విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయంపై దిశానిర్దేశం చేశారు.

CM KCR: చిలిపి పనులు వద్దు.. అడ్డంగా బుక్ చేస్తారు.. పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు
CM KCR
Follow us

|

Updated on: Oct 15, 2023 | 2:36 PM

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. ఆదివారం నాడు(అక్టోబర్ 15) తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. ఈ బీఫామ్స్ ఇచ్చే సమయంలో అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు కేసీఆర్. బీఫామ్స్ నింపే విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయంపై దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. అంతా తమకే తెలుసు అన్నట్లు ప్రవర్తించొద్దంటూ సున్నితంగా హెచ్చరించారు కూడా. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, హైరానా పడొద్దని నేతలకు సూచించారు కేసీఆర్. చివరి రోజు వరకు సమయం ఉందని ఆగమాగం అవ్వొద్దని సూచించారు. హడావుడిలో బీఫామ్స్ తప్పుగా నింపొద్దని, ఆ తరువాత టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని అలర్ట్ చేశారు.

ఇందుకు ఉదాహరణగా శ్రీనివాస్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డితో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు కేసీఆర్. కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారని, ఇలాంటి వాటిపట్ల అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. పార్టీకి సంబంధించి న్యాయ కోవిదులు ఉన్నారని, సమస్యలుంటే వారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అంతా తమకే తెలుసునని అనుకోవద్దని హితవు చెప్పారు. ఎన్నికకు ఎన్నికకు కొత్త నిబంధనలు వస్తున్నాయని, పార్టీకి అందుబాటులో ఉన్న న్యాయవాదులను సంప్రదించి అవసరమైన సహాయం తీసుకోవాలన్నారు. అప్‌డేట్ ఓటర్ లిస్ట్ వచ్చిందన్నారు. ఇక ఇవాళ 51 మందికి భీపామ్ ఇచ్చిన కేసీఆర్.. సోమవారం కూడా బీఫామ్‌లను అందజేస్తామన్నారు. మిగిలిన అభ్యర్థులు ప్రగతి భవన్‌కు వచ్చి బీఫామ్ తీసుకోవాలన్నారు. విపక్ష నేతలు సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, ఎన్నికల ఘట్టంలో చాలా కీలకంగా వ్యవహరించాలని నేతలకు చెప్పారు కేసీఆర్. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచనలు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. నేతలంతా కచ్చితంగా కార్యకర్తలందరినీ సంప్రదించాలన్నారు. వారికి నిరంతరం కాంటాక్ట్‌లో ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. భీఫామ్స్ అందజేసిన అనంతరం.. ఒక్కో అభ్యర్థికి రూ. 40 లక్షల చెక్కు అందజేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.

ప్రశాంత్ రెడ్డి తరఫున బీఫామ్ అందుకున్న కవిత..

తెలంగాణ భవన్ వేదికగా గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ బీఫామ్ అందజేశారు. అయితే, వేముల ప్రశాంత్ రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కవిత బీఫామ్ అందుకున్నారు. ఇటీవలే వేముల ప్రశాంత్ రెడ్డి అమ్మ చనిపోయారు. ఈ కారణంగా ఆయన రాలేకపోయారు. దాంతో వేముల ప్రశాంత్ రెడ్డి బీఫామ్‌ను కవిత అందుకున్నారు. ఇక సీఎం కేసీఆర్ తరఫున కామారెడ్డి బీఫామ్‌ను గంప గోవర్థన్ రెడ్డి అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

పలువురు అభ్యర్థులను మార్చే యోచనలో బీఆర్ఎస్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌లో కొందరి పేర్లను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్స్ అందజేశారు కేసీఆర్. అయితే, కొందరు అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం నేపథ్యంలో మిగతా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ముందు ప్రకటించిన వారిలో ఐదుగురు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

చిలిపి పనులు వద్దు..

బీఆర్ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ కీలక సూచనలు చేశారు. అభ్యర్థులందరూ సహనంతో ప్రచారం చేయాలన్నారు. ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలన్నారు. చిలిపి పనులతో కొందరు అవకాశాలు కోల్పోయారని, పలువురు అభ్యర్థులనుద్దేశించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌పై విపక్షాలు కుట్రలు చేస్తాయని, చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..