‘భారత్ మాతా కీ జై’ అంటేనే భారత్‌లో చోటు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలలంగాణ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ఉండాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా భారత్ మాతాకీ జై అనాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులు వాడుతున్న భాషను ఆయన తప్పుబట్టారు. తప్పుడు మాటలు మాట్లాడేవారికి గుణపాఠం చెప్పాల్సిందేనన్నారు. తెలంగాణలో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు.

కేంద్రం, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటంతో తన బండారం బయట పడుతుందని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ఆరోపించారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుతో తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందన్నారు ఆయన. కేంద్ర సర్కార్..కృష్ణా ట్రిబ్యునల్‌ను నియమించిన నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రైతు సదస్సు నిర్వహించింది తెలంగాణ బీజేపీ శాఖ.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటారా? అని ప్రశ్నించారు. వందేమాతరం, భారత్ మాతా కీ జై’ అన్న వారికే భారత దేశంలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరైతే ‘భారత్ మాతా కీ జై అనరో, ఎవరికైతే హిందూస్థాన్ మీద, భారత్ మీద విశ్వాసం లేదో, ఎవరైతే పాకిస్థాన్ జిందాబాద్ అంటారో వారు భారత్ దేశం విడిచి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాంటి వారికి మన దేశంలో స్థానం లేదని మంత్రి కైలాష్ తేల్చి చెప్పారు.
మరోవైపు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పీడ్ పెంచింది. మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్న బీజేపీ రేపు మొదటి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు..బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై..తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి, లిస్టు ఫైనల్ చేయనుంది. ఇక నేటినుంచే కమలం పార్టీ జాతీయనేతలు ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు.
తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకునేందుకు ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీతో భారీ బహిరంగసభలు నిర్వహించింది. అదే జోష్‌తో ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ. అందులోభాగంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పురుషోత్తం రూపాల, సాధ్వి నిరంజన్ తెలంగాణ బాట పడుతున్నారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ముషీరాబాద్‌కు చేరుకుని మత్స్యకారులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి రానున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. జమ్మికుంట, బడంగ్‌పేట్ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. కేంద్రమంత్రి పురుషోత్తం కల్వకుర్తి బహిరంగ సభకు హాజరవుతారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..