AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: కేసీఆర్‌ సెంటిమెంట్‌ వర్కౌవుట్‌ అవుతుందా? మంత్రి కేటీఆర్ చెప్పిన ఇంట్రస్టింగ్ లాజిక్..

గులాబీ బాస్‌..తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసే ప్రతి పనిలో 6 నంబర్‌కు ప్రాధాన్యం ఉండేటట్లుగా వ్యవహరిస్తారట. ప్రయాణించే వాహనం సహా, కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్‌ సమావేశం, ఇతర అన్నీ పనుల్లో ఆరు సంఖ్య ఉండేలా చూస్తారంట కేసీఆర్‌. ముఖ్యమంత్రి వ్యవహారాలను దగ్గరి నుంచి విశ్లేషించిన వ్యక్తులు చెప్తున్న మాటలు ఇవి. ఇక ఇవాళ అంటే 15వ తేదీన..

Telangana Elections: కేసీఆర్‌ సెంటిమెంట్‌ వర్కౌవుట్‌ అవుతుందా? మంత్రి కేటీఆర్ చెప్పిన ఇంట్రస్టింగ్ లాజిక్..
CM KCR
Shiva Prajapati
|

Updated on: Oct 15, 2023 | 7:36 AM

Share

హైదరాబాద్, అక్టోబర్ 15: లక్కీ నంబర్‌.. సెంటిమెంట్‌.. ఎలక్షన్‌లో వర్కౌవుట్‌ అవుతుందా? సెంటిమెంట్లను కాస్త ఎక్కువగా ఫాలో అయ్యే సీఎం కేసీఆర్‌ అదృష్ట సంఖ్య 6 అట. లక్కీ నంబర్‌ను అనుసరించే కేసీఆర్‌ అన్నీ పనులు చేస్తారట. ఈ ఎన్నికల్లో కూడా కారు పార్టీకి ఆ లక్కీ నంబర్‌ కలిసొచ్చిదంట. మరీ కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా? మంత్రి కేటీఆర్‌ చెప్పిన లాజిక్‌ ఏంటి? ప్రత్యేక కథనం మీకోసం..

కేసీఆర్‌ చేసే ప్రతి పనిలో 6 నంబర్‌కు ప్రాధాన్యం..

గులాబీ బాస్‌..తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసే ప్రతి పనిలో 6 నంబర్‌కు ప్రాధాన్యం ఉండేటట్లుగా వ్యవహరిస్తారట. ప్రయాణించే వాహనం సహా, కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్‌ సమావేశం, ఇతర అన్నీ పనుల్లో ఆరు సంఖ్య ఉండేలా చూస్తారంట కేసీఆర్‌. ముఖ్యమంత్రి వ్యవహారాలను దగ్గరి నుంచి విశ్లేషించిన వ్యక్తులు చెప్తున్న మాటలు ఇవి. ఇక ఇవాళ అంటే 15వ తేదీన..ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు, ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు. 1+5=6 అంటే ఆరు నంబర్‌ కలిసి వచ్చేలా సెంటిమెంట్‌గా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్‌. దీన్నే ఆయన అభిమానులు కేసీఆర్‌ సిక్త్స్‌ సెన్స్‌ అని చెప్తున్నారు.

ఇటీవల హనుమకొండజిల్లా పరకాల సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. మూడోసారి తమ ప్రభుత్వం వస్తుందని చెప్పేందుకు ఓ ఆసక్తికరమైన లాజిక్ చెప్పుకొచ్చారు. ఎలక్షన్‌ షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ నవంబర్‌ 30వ తేదీ కాగా, కౌటింగ్ డిసెంబర్ 3న జరగనుంది. ఈ రెండింటినీ కూడితే 3+3=6 వస్తుందని, ఇది కేసీఆర్‌ లక్కీ నంబర్‌ అన్నారు. కేసీఆర్‌ సెంటిమెంట్‌ ప్రకారం..తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టటం ఖాయమంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొత్తానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి లెక్క కుదిరింది.. 6 అచ్చొచ్చిన నంబర్‌..మూడోసారి సీఎం కూడా కేసీఆరే అని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. మరి అన్నీ ఆయనకు అనుకూలంగా రావటం యాదృచ్ఛికమో, కాకతాలీయమో కానీ.. హ్యాట్రిక్ విజయం దక్కుతుందో లేదో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..