Andhra Pradesh: 6 నెలలుగా అమావాస్య రోజున క్షుద్ర పూజలు.. కట్ చేస్తే..

ప్రపంచ అంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంది.. కొందరు జనాలు మాత్రం ఇంకా మూఢ నమ్మకాల్లోనే జీవిస్తున్నారు. వాటిని విశ్వసిస్తూ.. ఇతరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడిలో క్షుద్ర పూజల కలకలం రేపింది. ఈ వ్యవహారంపై డయల్ 100కు సమాచారం ఇచ్చారు స్థానికులు. దాంతో వ్యవహారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముళ్లపూడి గ్రామ శివారులో..

Andhra Pradesh: 6 నెలలుగా అమావాస్య రోజున క్షుద్ర పూజలు.. కట్ చేస్తే..
Black Magic
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 16, 2023 | 7:56 AM

తిరుపతి, అక్టోబర్ 15: ప్రపంచ అంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంది.. కొందరు జనాలు మాత్రం ఇంకా మూఢ నమ్మకాల్లోనే జీవిస్తున్నారు. వాటిని విశ్వసిస్తూ.. ఇతరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడిలో క్షుద్ర పూజల కలకలం రేపింది. ఈ వ్యవహారంపై డయల్ 100కు సమాచారం ఇచ్చారు స్థానికులు. దాంతో వ్యవహారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముళ్లపూడి గ్రామ శివారులో ఉన్న ఇంట్లో గత 6 నెలలుగా ప్రతి అమావాస్య రోజు అర్థరాత్రి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు స్థానికులు. ఇప్పటికే స్థానిక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఇవాళ డయల్ 100కు కాల్ చేశారు. దాంతో ఎట్టకేలకు రంగంలోకి దిగారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని వదిలిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్షుద్ర పూజల వ్యవహారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కాగా, క్షుద్ర పూజలు జరిగిన ఇంట్లో.. మట్టి కుండలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు, చాకు, పూలు, దీపాలు, తాయత్తులు వంటి వస్తువులను గుర్తించారు పోలీసులు. ఇంట్లో తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు పోలీసులు. అయితే, అదుపులో తీసుకున్న నిందితులను కారులో తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, మంత్రాలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు తిరుచానూరు పీఎస్‌కు తీసుకెళ్లలేదు. దాంతో వీరిని వదిలేశారా? లేక మరెక్కడికి తీసుకెళ్లారనేది సస్పెన్స్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..