Telangana: తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న క్యాష్‌, గోల్డ్‌.. లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Telangana News: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో లెక్కా పత్రం లేకుండా తీసుకెళ్తున్న కోట్ల రూపాయల నగదు దొరుకుతున్నాయి. కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి.తెలంగాణలో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు.

Telangana: తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న క్యాష్‌, గోల్డ్‌.. లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Telangana Money Seized
Follow us

|

Updated on: Oct 15, 2023 | 11:56 AM

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో లెక్కా పత్రం లేకుండా తీసుకెళ్తున్న కోట్ల రూపాయల నగదు దొరుకుతున్నాయి. కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి.తెలంగాణలో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేస్తోన్నారు. నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నగదు తరలివస్తుందనే సమాచారంతో మరింత అప్రమత్తమై రాష్ట్ర బోర్డర్లలో కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ తనిఖీలలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతోంది. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తరలిస్తున్నవారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

రూ.74.95 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, గోల్డ్..

ఈ నెల 9వ తేదీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా.. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడింది. దాదాపు రూ.74.95 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, గోల్డ్ పట్టుకున్నారు. ఇందులో రూ.48.32 కోట్ల నగదు ఉండగా.. రూ.4.72 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తరలిస్తున్న బంగారాన్ని కూడా పట్టుకున్నారు. నగదు, బంగారం తీసుకెళ్లేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలను ప్రజలు తమ దగ్గర ఉంచుకోవాలని, లేకపోతే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్నికల కోడ్‌ను అనుసరించి ఈసీ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తోంది తెలంగాణ పోలీస్‌శాఖ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి