AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: రావణాసుర విషయంలో రవితేజ గ్రేట్‌ మూవ్‌.. బయ్యర్లు నష్టపోకుండా ఉండేందుకు కీలక నిర్ణయం!!

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్లు ఖాతాలో వేసుకున్నాడు హీరో రవితేజ. అదే ఊపులో రావణాసుర రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్యాలెంటెడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో అను ఇమాన్యూయేల్, ఫరియా అబ్ధుల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా..

Ravi Teja: రావణాసుర విషయంలో రవితేజ గ్రేట్‌ మూవ్‌.. బయ్యర్లు నష్టపోకుండా ఉండేందుకు  కీలక నిర్ణయం!!
Ravi Teja
Basha Shek
|

Updated on: May 24, 2023 | 2:58 PM

Share

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్లు ఖాతాలో వేసుకున్నాడు హీరో రవితేజ. అదే ఊపులో రావణాసుర రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్యాలెంటెడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో అను ఇమాన్యూయేల్, ఫరియా అబ్ధుల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. అక్కినేని సుశాంత్ మరో కీ రోల్‌ పోషించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. టీజర్లు, ట్రైలర్లతో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన రావణాసుర తీరా థియేటర్లలో రిలీజయ్యాక మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. దీంతో రావణాసుర టీమ్‌కు నష్టాలొచ్చాయి. అయితే సినిమాలో రవితేజ యాక్టింగ్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అని చెప్పుకోవచ్చు. అందుకే ఓటీటీలో రిలీజయ్యాక రావణాసుర సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకుంది.

కాగా రవితేజకు ఉన్న డిమాండ్‌, వాల్తేరు వీరయ్య, ధమాకాలు సూపర్‌ హిట్‌ కావడంతో రావణాసుర రిలీజ్‌కు ముందు డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు కొనుగోలు చేశారు. అయితే నెగెటివ్‌ రావడంతో బయ్యర్లకు భారీగానే నష్టాలు వచ్చాయట. ఇక రవితేజ కూడా ‘రావణాసుర’ సినిమా రిజల్ట్‌పై బాగానే అప్‌సెట్‌ అయ్యారట. అదే సమయంలో తనను నమ్మి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు నష్టపోవడాన్ని ఈ స్టార్ హీరో భరించలేకపోయాడట. అందుకే వాళ్లను ఆదుకునేందుకు తగిన నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు బయ్యర్లకు రవితేజ సెటిల్‌మెంట్ చేశాడని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక వెలువడ లేదు. ఒకవేళ ఇదే నిజమయితే రవితేజ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. రవితేజ ప్రస్తుతం టైగర్‌ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

Follow Us
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్
సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్
టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?
టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?
మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?
మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?
నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..
నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..
ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?
గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?
పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే
పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే