Mahesh Babu: ప్రభాస్ ఫ్యాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్.. ‘ఫేమస్ అద్భుతమ్’..
ఈ సినిమా ప్రమోషన్స్ విభిన్నంగా స్టార్ట్ చేసి.. ఆడియన్స్లో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు. మేమ్ ఫేమస్ మూవీ చూసిన ప్రభాస్.. ఈ మూవీ అద్భుతమంటూ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన సినిమా మేమ్ ఫేమస్. ఈ చిత్రానికి తనే స్వయంగా దర్శకత్వం వహించారు. అనేక మంది డెబ్యూ టాలెంటెడ్ యువతతో తెరకెక్కించిన ఈ సినిమా రేపు (మే26న) ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విభిన్నంగా స్టార్ట్ చేసి.. ఆడియన్స్లో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు. మేమ్ ఫేమస్ మూవీ చూసిన ప్రభాస్.. ఈ మూవీ అద్భుతమంటూ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
“ఇప్పుడే మేమ్ ఫేమస్ సినిమా చూశాను. ఇదొక అద్భుతమైన చిత్రం. సినిమాలోని ప్రతి నటీనటులు నటనకు ఫిదా అయిపోయాను. ముఖఅయంగా రచయిత, దర్శకుడు, నటుడు సుమంత్ ప్రభాస్ ఎంతో ప్రతిభ ఉన్న అబ్బాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో సహా అన్ని క్రాఫ్ట్స్ ఫర్ఫెక్ట్ గా కుదిరాయి. కొంతమంది డెబ్యూటెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఈ మూవీ తీసినందుకు నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, యువ బృందానికి నా అభినందనలు. ఇలాంటి టాలెంట్ కు మద్దతుగా నిలిచినందుకు గర్వంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు మహేష్.




మేమ్ ఫేమస్ చిత్రాన్ని చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అండ్ లహరి ఫిల్మ్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రు, మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు. చాయ్ బిస్కెట్ టీం గతంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మేజర్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మేమ్ ఫేమస్ సినిమా తెరకెక్కింది. ఇందులో సుమంత్ ప్రభాస్ తోపాటు.. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి నటించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు.
Just watched #MemFamous! Brilliant film!! ❤️❤️
Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s – what a talent!
The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of…
— Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.