AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Antony: ‘బిచ్చగాడు’ మనసు బంగారం.. తిరుపతిలోని యాచకుల కోసం ఏకంగా..

నకిలీ, డాక్టర్‌ సలీమ్‌, బిచ్చగాడు తదితర సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు విజయ్‌ ఆంటోని. ముఖ్యంగా బిచ్చగాడు సినిమా ఆయనకు ఎంతో అభిమానులను తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ తర్వాత వరుసగా ప్లాఫులు ఎదుర్కొన్నాడు విజయ్‌. కథల ఎంపికలో వైవిధ్యమున్నా సక్సెస్‌ మాత్రం దొరకలేదు. అయితే ఎట్టకేలకు చాలా ఏళ్ల తర్వాత హిట్‌ను అందుకున్నాడీ ట్యాలెంటెడ్‌ హీరో.

Vijay Antony: 'బిచ్చగాడు' మనసు బంగారం.. తిరుపతిలోని యాచకుల కోసం ఏకంగా..
Vijay Antony
Basha Shek
|

Updated on: May 27, 2023 | 3:15 PM

Share

నకిలీ, డాక్టర్‌ సలీమ్‌, బిచ్చగాడు తదితర సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు విజయ్‌ ఆంటోని. ముఖ్యంగా బిచ్చగాడు సినిమా ఆయనకు ఎంతో అభిమానులను తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ తర్వాత వరుసగా ప్లాఫులు ఎదుర్కొన్నాడు విజయ్‌. కథల ఎంపికలో వైవిధ్యమున్నా సక్సెస్‌ మాత్రం దొరకలేదు. అయితే ఎట్టకేలకు చాలా ఏళ్ల తర్వాత హిట్‌ను అందుకున్నాడీ ట్యాలెంటెడ్‌ హీరో. తనకు బ్రేక్‌ ఇచ్చిన బిచ్చగాడు సీక్వెల్‌తోనే మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ అందుకున్నాడు. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. తమిళంలో కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు బాక్సాఫీస్‌ దగ్గర రూ. 6.93 కోట్ల షేర్‌ (రూ. 12.20 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు తెలిపారు. కాగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న బిచ్చగాడు సినిమా బయ్యర్స్‌కు లాభాల పంట పండిస్తోంది. కాగా హీరోగా, డైరెక్టర్​గా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్​గా ‘బిచ్చగాడు 2’ సినిమాను తన భుజస్కంధాలపై మోశారు. షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. అయితే తన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కింది. సినిమా అంచనాలకు మించి సక్సెస్‌ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్నారు విజయ్‌. ఇందులో భాగంగా బుధవారం తిరుమల, తిరుపతిలో సందడి చేశారాయన.

ఈ సందర్భంగా తిరుపతి కపిలతీర్థంలోని రోడ్డులో ఉన్న యాచకులను కలిశారు విజయ్ ఆంటోని. వారికి ‘యాంటీ బికిలీ’ పేరిట స్పెషల్‌ కిట్లను హీరో అందజేశారు. ఇందులో భాగంగా దుప్పటి, చెప్పులు, అద్దం, సబ్బు, నూనె బాటిల్, దువ్వెన, విసనకర్ర ఉన్న కిట్స్​ను యాచకులకు అందజేశారు. అంతేకాదు వారితో కాసేపు గడిపారు. వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్‌ ‘బిచ్చగాడు 2 సక్సెస్​తో తాను చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. ‘ఈ విజయాన్ని నేను ఊహించలేదు. తమిళంలో కంటే తెలుగు ఆడియెన్స్‌ నా సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. బిచ్చగాడు 3 స్టోరీ విషయంలో ఇంకా ఏమీ ఆలోచించలేదు. 2,3 నెలల్లో దీనిని ఫైనలైజ్‌ చేస్తా’ అని చెప్పుకొచ్చారు విజయ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి