నిఖిల్‌ ‘యువత’ హీరోయిన్‌ గుర్తుందా? ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

హ్యాపీడేస్‌తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్‌ సిద్ధార్థ్‌కు సోలో హీరోగా మంచి బ్రేక్‌ ఇచ్చిన చిత్రం యువత. ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న పరశురామ్‌ ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. అలాగే చాలామందికి బ్రేక్‌ ఇచ్చింది. నిఖిల్‌తో పాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌ అక్షకు ఇదే మొదటి తెలుగు సినిమా

నిఖిల్‌ 'యువత' హీరోయిన్‌ గుర్తుందా? ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Yuvatha Movie
Follow us
Basha Shek

|

Updated on: May 24, 2023 | 4:18 PM

హ్యాపీడేస్‌తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్‌ సిద్ధార్థ్‌కు సోలో హీరోగా మంచి బ్రేక్‌ ఇచ్చిన చిత్రం యువత. ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న పరశురామ్‌ ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. అలాగే చాలామందికి బ్రేక్‌ ఇచ్చింది. నిఖిల్‌తో పాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌ అక్షకు ఇదే మొదటి తెలుగు సినిమా. అంతకు ముందు ఒకటి, రెండు హిందీ, మలయాళ సినిమాల్లో నటించిన అక్ష యువత సినిమాతో మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇందులో ఆమె అభినయానికి కూడా మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా హిట్‌ కావడంతో తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. యువత తర్వాత నాని రైడ్‌, రామ్‌ కందిరీగ, శ్రీకాంత్ శత్రువు, రవితేజ బెంగాల్‌ టైగర్‌, బాలకృష్ణ డిక్టేటర్‌, మెంటల్‌ పోలీస్‌, డాక్టర్‌ సలీమ్‌ తదితర సినిమాల్లో నటించింది. అయితే వీటిలో కందిరీగ సినిమా తప్ప మరేదీ హిట్‌ కాలేదు. కందిరీగ సినిమాలో తెలంగాణ యాసతో అక్ష పలికిన డైలాగులు చాలామందికి గుర్తుండిపోతాయి. అక్ష చివరిగా శర్వానంద్‌ రాధా సినిమాలో నటించింది. ఆతర్వాత ఎందుకో కానీ సినిమాలు చేయలేదు.

2017 తర్వాత సినిమాల్లో కనిపించని అక్ష 2021లో మాత్రం ఓ హిందీ వెబ్‌సిరీస్లో నటించింది. ఖాట్మండ్‌ కనెక్షన్‌ పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్‌ సూపర్‌ హిట్ అయ్యింది. దీంతో అక్ష మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ప్రస్తుతం ఆమె బిజినెస్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్‌ బేస్డ్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ప్రొడక్ట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. కాగా సినిమాలకు దూరంగా ఉన్న అక్ష సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. నిత్యం తన లేటెస్ట్‌ గ్లామర్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేసుకుంటోంది. వీటిని చూసిన నెటిజన్లు గ్లామర్‌ విషయంలో ‘అక్ష ఏం మాత్రం మారలేదు. ఇప్పటికీ అదే అందం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అక్ష లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.