NTR Birth Anniversary: ‘నూటికో కోటికో ఒక్కరు’.. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌

నందమూరి తారకరామరావు శతజయంతి (మే 28)ని పురస్కరించుకుని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. యుగపురుషుడి సేవలను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి దివంగత సీఎంకు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు

NTR Birth Anniversary: 'నూటికో కోటికో ఒక్కరు'.. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌
NTR, Chiranjeevi, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: May 28, 2023 | 11:10 AM

నందమూరి తారకరామరావు శతజయంతి (మే 28)ని పురస్కరించుకుని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. యుగపురుషుడి సేవలను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి దివంగత సీఎంకు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. ‘నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు ఎన్టీఆర్‌. తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం’ అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ఇక చిరంజీవి సోదరుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.

‘చరిత్ర మరవని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే అధికారం కైవసం.. ఇలా మాట్లాడుతుంటే స్పురణకు వచ్చే ఒకే ఒక పేరు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది. ఎందరికో అనుసరణీయమైనది. ఢిల్లీ రాజకీయాల్లో గుర్తింపునకు నోచుకోక తెలుగు ఖ్యాతి మసకబారుతున్నతరుణంలో తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం అందుకుని ఢిల్లీ దాకా తెలుగువారి సత్తా చాటారు. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను’ అని ఒక ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..