Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సెలబ్రేషన్స్ ఓవైపు.. భావోద్వేగం మరోవైపు.. జడ్డూని హగ్ చేసుకుని ధోనీ ఏంచేశాడంటే? వైరల్ వీడియో

Chennai Super Kings Champion IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ ఎడిషన్ ముగిసింది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలిచి, ట్రోఫీని దక్కించుకుంది.

Video: సెలబ్రేషన్స్ ఓవైపు.. భావోద్వేగం మరోవైపు.. జడ్డూని హగ్ చేసుకుని ధోనీ ఏంచేశాడంటే? వైరల్ వీడియో
Ms Dhoni Tears
Follow us
Venkata Chari

|

Updated on: May 30, 2023 | 1:08 PM

MS Dhoni Tears: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ ఎడిషన్ ముగిసింది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలిచి, ట్రోఫీని దక్కించుకుంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ ఎడిషన్ ముగిసింది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలిచి, ట్రోఫీని దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో ఎవరూ ఊహించని రీతిలో చెన్నై విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌ విజయంలో రవీంద్ర జడేజా హీరోగా మారాడు. ఆఖరి ఓవర్ 6 బంతులు అభిమానులనే కాకుండా ఇరు జట్ల ఆటగాళ్లను సైతం కంటతడి పెట్టించాయి.

చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 10 పరుగులు చేయాల్సి ఉంది. ఫామ్‌లో లేని జడేజా క్రీజులో ఉన్నాడు. సీఎస్‌కేకు విజయం అసాధ్యమని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే చాలా మంది లెక్కలను జడ్డూ తారుమారు చేశాడు. మోహిత్ శర్మ 5వ బంతికి సిక్సర్, చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. దీనికి ముందు ఔట్ అయిన ఎంఎస్ ధోని డగౌట్‌లో కాస్త టెన్షన్‌గా కనిపించాడు. గెలిచిన వెంటనే జడేజాను పైకి ఎత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీం యువ ఆటగాడు సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్‌తో 200 పరుగుల మార్కును చేరుకుంది. 96 పరుగులు చేసిన సుదర్శన్ ఫైనల్ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. అలాగే వృద్ధిమాన్ సాహా 54, శుభ్‌మన్ గిల్ 39, హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేశారు. జీటీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది.

టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నైకి వర్షం అడ్డుకట్ట వేసింది. 2 గంటల పాటు ఆట నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం చెన్నైకి 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అందుకు తగ్గట్టుగానే క్రీజులోకి వచ్చిన గైక్వాడ్, కాన్వాయ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. గైక్వాడ్ 16 బంతుల్లో 26 పరుగులు చేయగా, కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత శివమ్ దూబే 32, అజింక్యా రహానే 27, అంబటి రాయుడు 19, రవీంద్ర జడేజా 15 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..