IPL 2023: ఆ సెంటిమెంటే కొంపముంచిందా.. సచిన్, కోహ్లీల జాబితాలో టీమిండియా ఫ్యూచర్ స్టార్.. అదేంటంటే?

Shubman Gill: ఇంతకుముందు ఐపీఎల్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లికి ఎదురైన ఆ సెంటిమెంట్.. తాజాగా శుభ్మన్ గిల్‌ విషయంలోనూ చోటుచేసుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని గెలవలేకపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

IPL 2023: ఆ సెంటిమెంటే కొంపముంచిందా.. సచిన్, కోహ్లీల జాబితాలో టీమిండియా ఫ్యూచర్ స్టార్.. అదేంటంటే?
Sachin Shubman Gill
Follow us
Venkata Chari

|

Updated on: May 30, 2023 | 12:46 PM

ఐపీఎల్ 2023 గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు చిరస్మరణీయమైనది. గిల్ రెండు భారీ అవార్డులను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్న విభాగంలో చేరాడు. IPL 2023లో గిల్ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు. కానీ, అతని జట్టు గుజరాత్ టైటాన్స్ మాత్రం టైటిల్ గెలవలేకపోయింది.

శుభ్‌మన్ గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలకు కూడా ఇలాగే జరిగింది. 2010లో, ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ఆరెంజ్ క్యాప్ (618 పరుగులు) గెలుచుకున్నాడు. అదే సంవత్సరం మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అయితే సచిన్ జట్టు ఆ సంవత్సరం ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. 2010లో సచిన్ టెండూల్కర్‌తో జరిగినట్లే, 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇదే చరిత్ర రిపీటైంది.

విరాట్ కోహ్లీ 2016 సీజన్‌లో 4 సెంచరీల ఆధారంగా 973 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో బెంగళూరు జట్టు టైటిల్‌కు దూరంగా ఉండిపోయింది. ఆ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును కోహ్లీ గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా 2023 సీజన్‌లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌తోపాటు మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్న శుభ్‌మాన్ గిల్ విషయంలోనూ అదే రిపీటైంది. దీంతో ఈ సెంటిమెంట్‌ ఇంకెంతమంది ప్లేయర్ల విషయంలో జరగనుందోనని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..