- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: MS Dhoni CSK Clinches 5th IPL Trophy, Rinku Singh, Nehal Wadhera, Yashaswi Jaiswal, Tilak Varma, Sai Sudharsan May Grab Team India Chances Soon
IPL 2023: ఐపీఎల్ టూ టీమిండియా.. భవిష్యత్తులో ఈ 5 గురు ప్లేయర్స్‌కు జట్టులోకి రావడం ఖాయం.!
మునపటిలా కాదు.. ఈ ఏడాది ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ దుమ్ముదులిపారు. తమదైన శైలి ఆటతీరుతో అదరగొట్టడమే కాదు.. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారని చెప్పొచ్చు.
Updated on: May 30, 2023 | 1:01 PM

మునపటిలా కాదు.. ఈ ఏడాది ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ దుమ్ముదులిపారు. తమదైన శైలి ఆటతీరుతో అదరగొట్టడమే కాదు.. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యం ఈ 5 గురు ప్లేయర్స్‌కు త్వరలోనే టీమిండియాలో చోటు దక్కడం గ్యారంటీగా కనిపిస్తోంది. మరి వారెవరంటే..?

సాయి సుదర్శన్: గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ బ్యాటర్ తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకర్షించాడు. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ ఫైనల్స్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి.. ప్రత్యర్ధులను బెదరగొట్టాడు. ఇక ఐపీఎల్ ఫైనల్‌లో అతి తక్కువ వయస్సులో ఈ ఘనత సాధించింది కేవలం సుదర్శన్ మాత్రమే. కాగా, గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ప్రైస్‌తో సాయిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

యశస్వి జైస్వాల్: ఈ 22 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ రాజస్థాన్ రాయల్స్‌కి ప్రాతినిధ్యం వహించాడు. 14 మ్యాచ్‌ల్లో 48.07 సగటుతో 625 పరుగులు చేశాడు. అలాగే ఒక సెంచరీ, 13 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించి.. రికార్డుల్లోకి ఎక్కాడు.

తిలక్ వర్మ: ఈ హైదరాబాదీ బ్యాటర్ ముంబై ఇండియన్స్‌కు వెన్నుముకలా నిలిచాడు. కావాల్సినప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు.. మెరుపులు మెరిపించాడు కూడా. ఎలిమినేటర్ మ్యాచ్‌లో మనోడు షమీ బౌలింగ్‌లో చేసిన రన్స్.. యువరాజ్‌ను గుర్తు చేశాయి.

రింకూ సింగ్: ఈ ఏడాది ఫినిషర్ అవతారమెత్తాడు రింకూ సింగ్. 4 మ్యాచ్‌ల్లో 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో వరుసగా 5 సిక్సర్లు బాది కేకేఆర్‌కు సూపర్ విక్టరీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు రింకూ.

నేహల్ వధేరా: ముంబై ఇండియన్స్‌కు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. తిలక్ వర్మ లేని సమయంలో జట్టుకు అండగా నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 26.77 సగటుతో 241 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లలో ఫినిషర్‌గా తన సత్తాను చాటాడు.





























