Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Records: ఐపీఎల్ 2023లో టాప్ 10 రికార్డులు ఇవే.. లీగ్ చరిత్రలోనే తొలిసారి నమోదు.. అవేంటో తెలుసా?

IPL 2023లో రికార్డుల వర్షం కురిసింది. అటు పరుగుల నుంచి ఇటు వికెట్ల వరకు ఎన్నో నమోదయ్యాయి. ఐపీఎల్ హిస్టరీలో ఇంతవరకు నమోదవ్వని ఆ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.

IPL Records: ఐపీఎల్ 2023లో టాప్ 10 రికార్డులు ఇవే.. లీగ్ చరిత్రలోనే తొలిసారి నమోదు.. అవేంటో తెలుసా?
Ipl Top 10 Records
Follow us
Venkata Chari

|

Updated on: May 30, 2023 | 12:11 PM

ఐపీఎల్ 2023 ముగిసింది. సోమవారం ఉత్కంఠభరితమైన మ్యాచ్‌తో ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ట్రోఫీని గెలుచుకోవడంలో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలవలేకపోయింది. ఆఖరి బంతికి మ్యాచ్ ఫలితం బయటకు వచ్చింది. అయితే ఈ సీజన్ 10 రికార్డులు ఈ లీగ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

IPL 2023లో టాప్ 10 రికార్డులు ఇవే..

  1. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు నమోదైంది. ఈ సీజన్‌లో 1124 సిక్సర్లు బాదగా, 2022లో 1062 సిక్సర్లు నమోదయ్యాయి.
  2. ఐపీఎల్ 2023లో ఫోర్ల రికార్డు కూడ నమోదైంది. ఈ సీజన్‌లో అత్యధిక ఫోర్లు కనిపించాయి. ఈ ఏడాది మొత్తం 2174 ఫోర్లు కొట్టగా, 2022లో ఈ రికార్డు 2018 ఫోర్లుగా నిలిచింది.
  3. ఈ సీజన్ ఐపీఎల్‌లో సెంచరీల రికార్డు కూడా నమోదైంది. ఈసారి బ్యాట్స్ మెన్స్ 12 సెంచరీలు నమోదు చేశారు. ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు ఈసారి కనిపించాయి. 2022లో 8 సెంచరీలు నమోదయ్యాయి.
  4. ఈ IPL సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు కూడా కనిపించాయి. ఐపీఎల్ 2023లో బ్యాట్స్‌మెన్స్ 153 సార్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. 2022లో ఇది 118 సార్లు మాత్రమే జరిగింది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఒక సీజన్‌లో గరిష్టంగా 200 ప్లస్ స్కోర్లు ఈ సీజన్‌లో 37 సార్లు నమోదయ్యాయి. ఇది 2022తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. 2022లో మొత్తం 200 ప్లస్ స్కోర్లు 18 సార్లు మాత్రమే నమోదయ్యాయి.
  7. IPL 16వ సీజన్‌లో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 183గా నిలిచింది. ఇది IPL ఏ సీజన్‌లోనైనా అత్యధికం కావడం గమనార్హం. 2018లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 172గా నిలిచింది.
  8. ఈ సీజన్ రన్ రేట్ పరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2023లో బ్యాట్స్‌మెన్ ఓవర్‌కు 8.99 పరుగుల చొప్పున పరుగులు రాబట్టారు. 2018లో అత్యుత్తమంగా ఓవర్‌కు 8.65 పరుగులు వచ్చాయి.
  9. IPL 2023లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల టార్గెట్‌ను 8 సార్లు ఛేజ్ చేశారు. 2014లో ఇది 3 సార్లు మాత్రమే జరిగింది.
  10. ఈ IPL సీజన్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశారు. ఈ లీగ్ చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ఈ లిస్టులో చేరారు.
  11. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో యశస్వి జైస్వాల్, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌లు ఈ లిస్టులో చేరారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..