AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai Super Kings: ఐపీఎల్ టైటిల్ గెలవకముందే.. రూ.166 కోట్లు ఆర్జించిన సీఎస్‌కే యాజమాన్యం.. ఎలాగో తెలుసా?

IPL 2023 Final: ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించడంతో CSKకి 171 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

Chennai Super Kings: ఐపీఎల్ టైటిల్ గెలవకముందే.. రూ.166 కోట్లు ఆర్జించిన సీఎస్‌కే యాజమాన్యం.. ఎలాగో తెలుసా?
Chennai Super Kings Ms Dhon
Venkata Chari
|

Updated on: May 30, 2023 | 11:24 AM

Share

ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించడంతో CSKకి 171 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి జట్టును ఛాంపియన్‌గా మార్చాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా నిలిచిన జట్టుగా పేరొందిన సీఎస్‌కేకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. విశేషమేమిటంటే ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించకముందే సీఎస్‌కే యాజమాన్యం రూ.166 కోట్ల లాభాలను ఆర్జించింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

CSK యజమాని ఎవరు?

CSK యజమాని పేరు ఎన్ శ్రీనివాసన్. ఈయన కంపెనీ పేరు ఇండియా సిమెంట్. దేశంలోని సిమెంట్ పరిశ్రమలో ఇండియా సిమెంట్ ప్రముఖ కంపెనీగా నిలిచింది. దేశంలోని సిమెంట్ పరిశ్రమలో దాదాపు 5 నుంచి 7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న దేశంలోని టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఇది ఒకటి. ఎన్ శ్రీనివాసన్‌కు క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. బీసీసీఐ చీఫ్‌గా కూడా పనిచేశారు. దీంతో పాటు ఐసీసీ మాజీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. వీరితో అనేక వివాదాలు కూడా ఉన్నాయి. 2008 సంవత్సరంలో CSKని కొనుగోలు చేశాడు.

సోమవారం కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల..

సోమవారం ఎన్ శ్రీనివాసన్ కంపెనీ ఇండియా సిమెంట్ షేరు దాదాపు 3 శాతం పెరిగింది. ఆ తర్వాత కంపెనీ షేరు రూ.193.20 వద్ద ముగిసింది. కాగా, ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేరు కూడా రూ.193.50కి చేరింది. సిమెంట్ స్టాక్‌లో బూమ్ కనిపించడం ఇది వరుసగా రెండో రోజు. కాగా, శుక్రవారం కంపెనీ షేరు రూ.187.85 వద్ద ముగిసింది. ఇండియా సిమెంట్ 52 వారాల గరిష్టం రూ. 298.45గా నిలిచింది. ఇది సెప్టెంబర్ 20, 2022న ఉంది.

ఇవి కూడా చదవండి

మార్కెట్ క్యాప్ రూ.166 కోట్లు..

ఇండియా సిమెంట్ షేర్లు పెరగడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ రూ.5,821.41 కోట్లుగా ఉంది. సోమవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,987.21 కోట్లకు పెరిగింది. అంటే ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.166 కోట్లు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్‌కే ఛాంపియన్‌గా రాకముందే యాజమాన్య సంస్థకు రూ.166 కోట్ల లాభం వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..