Ambati Rayudu: ఆఖరి మ్యాచ్‌లో అంబటి రాయుడు కన్నీరు.. తెలుగు క్రికెటర్‌కు అరుదైన గౌరవం అందించిన ధోని
రిటైర్మెంట్.. క్రికెట్‌లోనే కాదు ఏ ఆటకైనా గుడ్ బై చెప్పడమంటే మనసుకు చాలా కష్టం. ఎన్నో ఏళ్లుగా ఒకే జట్టులో కొనసాగుతూ, తోటి ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటూ ఆటగాడికి ఉన్న ఫళంగా వదిలేసి వెళ్లాలంటే హృదయం బరువెక్కిపోతుంది. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.
రిటైర్మెంట్.. క్రికెట్‌లోనే కాదు ఏ ఆటకైనా గుడ్ బై చెప్పడమంటే మనసుకు చాలా కష్టం. ఎన్నో ఏళ్లుగా ఒకే జట్టులో కొనసాగుతూ, తోటి ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటూ ఆటగాడికి ఉన్న ఫళంగా వదిలేసి వెళ్లాలంటే హృదయం బరువెక్కిపోతుంది. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ జట్లుకు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన ఈ తెలుగు క్రికెటర్ ఇక మైదానంలో కనిపించడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి నిన్నటి మ్యాచ్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. కాగా గుజరాత్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదోసారి ధనాధాన్ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన రాయుడు 8 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫొర్, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ముఖ్యంగా జట్టుకు అవసరమైన సమయంలో ధనాధాన్ ఇన్నింగ్స్ ఆడి చెన్నైపై ఒత్తిడి తగ్గించాడు. కాగా మ్యాచ్ అనంతరం ఎమోషన్స్‌ను ఆపుకోలేకపోయాడు అంబటి. ఇంకెప్పుడూ మైదానంలోకి దిగలేననుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. సహచరులు అతనిని ఓదార్చారు. ఇక రాయుడు అందించిన సేవలకు గుర్తింపుగా కెప్టెన్ ధోని.. తెలుగు క్రికెటర్‌కు స్టేజ్ మీదకి పిలిచి ట్రోఫీ తీసుకోవాల్సిందిగా కోరాడు. తద్వారా తనకు ఘనమైన వీడ్కోలు అందేలా చూశాడు. ప్రస్తుతం రాయుడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రాయుడు రిటైర్మెంట్ తర్వాతి జీవితం మరింత బాగుండాలంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
#CHAMPION5 ??pic.twitter.com/9mvGuDyiwa
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023
Ambati Rayudu emotional and tears in his eyes after won IPL 2023 Trophy.
Won 6 IPL Trophy as player, joint most in the history. What a Legend.
CSK CSK CSK #AmbatiRayudu #CSKvsGT #IPLFinals #IPL2023Final #MSDhoni #CSK #RavindraJadeja pic.twitter.com/WiVsVqSSqO
— Purohit_Yashwant (@PurohitYassi17) May 30, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..