JIO Cinema: జియో సినిమా సరికొత్త రికార్డ్.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను ఎంత మంది చూశారో తెలుసా.?
ఐపీఎల్ 2023 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా దక్కించుకున్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా వేదికగా చాలా మంది ఐపీఎల్ను వీక్షించారు. జియో సినిమా యూజర్ల కోసం ఉచితంగా స్ట్రీమింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే సోమవారం..
ఐపీఎల్ 2023 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా దక్కించుకున్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా వేదికగా చాలా మంది ఐపీఎల్ను వీక్షించారు. జియో సినిమా యూజర్ల కోసం ఉచితంగా స్ట్రీమింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే సోమవారం జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో జియో సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. గుజరాత్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏకంగా 3.2 కోట్ల మంది వీక్షించడం విశేషం. గతంలో జియో సినిమా పేరుతో ఉన్న 2.57 కోట్ల రికార్డును మళ్లీ జియో సినిమానే బద్దుల కొట్టింది.
2019లో హాట్‌స్టార్‌లో ఒకేసారి 2.5 కోట్ల మంది క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించగా తాజాగా జియో సినిమాలో 3.2 కోట్ల మంది చూశారు. వేగంతో కూడిన ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉండడం, ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించడంతో జియో సినిమాకు వీక్షకులు పోటేత్తారు. ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా యూజర్లు జియో సినిమా ద్వారా ఐపీఎల్‌ను పెద్ద ఎత్తున వీక్షించారు. ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యధికంగా 2.2 కోట్ల మంది వీక్షించారు. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై మధ్య ఏప్రిల్ 17న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను 2.4 కోట్ల మంది చూశారు.
తాజాగా సోమవారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌ను ఐపీఎల్ చరిత్రంలో అత్యధికంగా వీక్షించారు. ఇదిలా ఉంటే ఇతర జట్లు ఆడిన మ్యాచ్‌లతో పోల్చితే జియో సినిమా ద్వారా చెన్నై జట్టు ఆడిన మ్యాచ్‌లనే ప్రేక్షకులకు ఎక్కువగా వీక్షించినట్లు గణంకాలు చెబుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..