Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో ఉన్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా? ఈ సౌతిండియన్‌ స్టార్‌ హీరో అంటే అందరికీ గౌరవమే

బాలనటుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకున్నాడు. సొంత భాషలోనే సినిమాలు చేసినా అతనంటే దక్షిణది ప్రేక్షకులందరికీ ఎంతో పరిచయం. అందుకు కారణం సినిమాలతో పాటు అతను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే. అనాథ శరణాలయాలు నిర్వహించాడు.

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో ఉన్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా? ఈ సౌతిండియన్‌ స్టార్‌ హీరో అంటే అందరికీ గౌరవమే
Arjun
Follow us
Basha Shek

|

Updated on: May 29, 2023 | 8:21 PM

పై ఫొటోలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ చేతుల్లో ఉన్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా? ఇతను సౌతిండియాలో ఫేమస్‌ హీరో. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. బాలనటుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకున్నాడు. సొంత భాషలోనే సినిమాలు చేసినా అతనంటే దక్షిణది ప్రేక్షకులందరికీ ఎంతో పరిచయం. అందుకు కారణం సినిమాలతో పాటు అతను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే. అనాథ శరణాలయాలు నిర్వహించాడు. పేద చిన్నారులకు ఉచిత విద్య, వసతి కల్పించాడు. అయితే మంచి వాళ్లను దేవుడు త్వరగా తన దగ్గరకు తీసుకెళతాడట. ఈ మాట నిజమో కాదో తెలియదు కానీ ఈ హీరో విషయంలో మాత్రం నిజమైంది. సినిమాలు, సేవా కార్యక్రమాలతో సౌతిండియన్‌ పవర్‌ స్టార్‌గా వెలుగొందిన అతను హఠాత్తుగా కన్నుమూశారు. గుండెపోటుతో చనిపోయి అందరినీ విషాదంలో ముంచేశాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో. అతను మరెవరో కాదు.. కొన్ని నెలల క్రితం అర్ధాంతరంగా మనల్ని వదిలి వెళ్లిపోయిన పునీత్ రాజ్‌ కుమార్‌.

కన్నడ నాట పవర్‌ స్టార్‌గా అశేష అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ రాజ్‌ కుమార్‌ 2021 అక్టోబర్‌ 29న గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. జిమ్ చేస్తుండగా.. హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయనను వెంటే ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్స్ ఎంత ప్రయత్నించిన ఆయనను కాపాడుకోలేకపోయారు. ఆయన హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికీ ఆయన మరణ వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారంటే అతి శయోక్తి కాదు. ఇక యాక్షన్‌ కింగ్‌తో పునీత్‌ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అందులో భాగంగానే ఓ సందర్భంగా పునీత్‌ను ఎత్తుకుని సరదాగా ఫొటో దిగారు అర్జున్‌. ఆ ఫొటోనే ఇది.

ఇవి కూడా చదవండి
Puneeth Raj Kumar

Puneeth Raj Kumar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు